ట్రైలర్ తోనే భయపెడుతున్న….

‘రాజు గారి గది’…. ఇప్పటికే విడుదలైన రెండు భాగాలలో మొదటి పార్ట్ హిట్ అవ్వగా రెండవ పార్ట్ మాత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. తాజాగా ఇప్పుడు ‘రాజు గారి గది 3’ సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

‘ఉయ్యాల జంపాల’ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అవిక గోర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అలీ, అజయ్ ఘోష్, ధన్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. కేవలం రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ సినిమా నుంచి కొన్ని ఆసక్తికరమైన విజువల్స్ ని చూపించారు.

ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఓక్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కి షబ్బీర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది దసరా కి విడుదల కానుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.