మొన్న జిమ్… ఇప్పుడు టెన్నిస్ టీం…

ఈ మధ్య కాలంలో తెలుగు హీరోయిన్ లు కేవలం సినిమాలను మాత్రమే నమ్ముకోకుండా…. వివిధ బిజినెస్ లను కూడా ప్రారంభిస్తున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు రకుల్ ప్రీత్ సింగ్.

స్టార్ హీరోయిన్ గా ప్రతి సినిమాకి భారీగా రెమ్యూనరేషన్ తీసుకోవడం మాత్రమే కాకుండా… ఆ డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా బాగానే నేర్చుకొంది రకుల్.

ఇప్పటికే రకుల్ ప్రీత్ తన తమ్ముడు అమన్ సింగ్ తో కలిసి ’45 ఫిట్ నెస్ జిమ్’ ను స్థాపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు వాళ్లు ఈ జిమ్ బ్రాంచ్ లను హైదరాబాద్ మరియు వైజాగ్ లో తెరిచేందుకు ప్లాన్ చేస్తున్నారట.

ఇదిలా ఉండగా రకుల్ కళ్ళు ఇప్పుడు స్పోర్ట్స్ రంగం మీద కూడా పడింది. రకుల్…. టెన్నిస్ ప్రీమియర్ లీగ్ హైదరాబాద్ టీం కి ఓనర్ గా మారింది.

అంకిత రైనా వంటి అద్భుతమైన ప్లేయర్లు ఉన్న ఈ టీం కి రకుల్ ప్రీత్ ఓనర్ అయింది. ఈ టీమ్ కు ఓనర్ గా మారడం తనకు చాలా ఎగ్జైటింగ్ గా ఉందంటూ రకుల్ ప్రీత్ చెప్పుకొచ్చింది.

అండర్ 14 మరియు అండర్ 19 కేటగిరి ప్లేయర్లు ఇందులో ఆడబోతున్నారు.

రకుల్ ప్రీత్ ఒకవైపు సినిమాలతో…. మరో వైపు ఇలా రెండు చేతులా సంపాదించే పనిలో పడిపోయింది.

ఇక సినిమాల పరంగా చూస్తే రకుల్ ప్రీత్ ఈ మధ్యనే ‘మన్మధుడు 2’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.