మరో విహారయాత్రకు ప్లాన్ చేస్తున్న సమంత !

వచ్చే వారం నుంచి సమంత తమిళ రిమేక్ 96 కి సంబంధించిన షూటింగ్ లో పాల్గొనబోతోంది. తమిళ వెర్షన్ లో త్రిష నటించిన రోల్ లో సమంత నటించబోతోంది. మరో రోల్ లో శర్వానందర్ నటిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు తెలుగు లో నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాతో పాటు…. సమంత ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించబోతోందన్న వార్తలు కూడా వచ్చాయి.

ఓ బేబీ విజయం తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న సమంత…. తర్వాత నాగార్జున పుట్టిన రోజు కి విహార యాత్ర కి వెళ్ళింది. తిరిగి వచ్చిన వెంటనే షూటింగ్ పనుల్లో పడిపోయింది.

అయితే సమంత 96 షూటింగ్ ని త్వరగా ముగించుకొని మళ్ళీ విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేస్తోందట. గత మూడేళ్లుగా షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్న సమంత…. కొత్త సినిమాలు ఏమి ఒప్పుకోకుండా బ్రేక్ తీసుకోవాలని అనుకుంటోందట. మరి ఈమెతో సినిమాలు తీయాలనుకుంటున్న దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. చూడాలి వాళ్ళు బయటకు ఎలా స్పందిస్తారో …!