బందోబస్త్…. ఈ విషయంలో సూర్య బాగా ఇబ్బంది పడ్డాడట !

సిల్వర్ స్క్రీన్ పై రొమాన్స్ చేయడం పెద్ద సమస్య కాదు. అంతా నటనే కాబట్టి నడిచిపోతుంది. కానీ అదే సిల్వర్ స్క్రీన్ పై పక్కన ఓ నటుడ్ని పెట్టుకొని, అదే నటుడి భార్యతో రొమాన్స్ చేయడమంటే మాత్రం కాస్త కష్టమైన పనే. సరిగ్గా ఇలాంటి చేదు అనుభవాన్నే చవిచూశాడు హీరో సూర్య. ఓవైపు ఆర్యను పెట్టుకొని, మరోవైపు అతడి భార్య సాయేషాతో రొమాన్స్ చేశానని చెప్పుకొచ్చాడు.

సూర్య లేటెస్ట్ మూవీ బందోబస్త్. ఇందులో ఆర్య కీలక పాత్ర పోషించాడు. ఇదే సినిమాలో ఆర్య రియల్ లైఫ్ భార్య సాయేషా హీరోయిన్ గా నటించింది. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ సినిమాలో కొన్ని సందర్భాల్లో ఆర్య పక్కన ఉంటుండగా సాయేషాతో సూర్య రొమాన్స్ చేయాల్సి వచ్చిందట. అలా 2 సందర్భాల్లో చాలా ఇబ్బంది పడ్డానంటున్నాడు సూర్య. నటనే కదా అని సరిపుచ్చుకోవడానికి కూడా వీల్లేకుండా ఆ పరిస్థితి ఉందన్నాడు.

ఇలా బందోబస్త్ సినిమా షూటింగ్ లో తనకు ఎదురైన క్లిష్టమైన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నాడు సూర్య. సాయేషా మాత్రం సినిమా కోసం చాలా కష్టపడిందని, ఇక ఆర్య విషయానికొస్తే అతడిలాంటి ఫిజిక్ అందరికీ ఉండాలని అన్నాడు. ఈనెల 20న థియేటర్లలోకి వస్తోంది బందోబస్త్.