నవ్విస్తున్న…. ‘తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్’ టీజర్

ఈ మధ్యనే ‘నిను వీడని నీడను నేనే’ సినిమా వంటి హారర్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కిషన్…. ఇప్పుడు ఫుల్ కామెడీతో ‘తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్’ అనే సినిమాతో త్వరలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

చాలాకాలం తెలుగు సినిమాలకి దూరంగా ఉన్న హన్సిక ఈ సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. పోసాని, వెన్నెల కిషోర్, మురళీశర్మ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జి.నాగేశ్వరరెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఇవాళ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. కేవలం నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో సినిమా మనల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది అని తెలుస్తోంది.

కామెడీ మాత్రమే కాక సినిమాలో యాక్షన్ కి కూడా పెద్ద పీట వేశారని అర్థమవుతోంది. అగ్రహారం నాగి రెడ్డి, సంజీవరెడ్డి కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో సందీప్ కిషన్ ఎలాంటి హిట్ అందుకుంటాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.