Telugu Global
NEWS

ఆటో డ్రైవర్ల ఆర్థిక సాయానికి దరఖాస్తుల వెల్లువ... అత్యధికంగా కృష్ణా జిల్లా నుంచే...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో, కారు డ్రైవర్ కమ్ ఓవర్ లకు ఇస్తామని ప్రకటించిన పది వేల రూపాయల ఆర్ధిక సాయానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. శనివారం నుంచి ఈ ఆర్థిక సాయం కోసం ఈ నెల 25 వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఒక్క శనివారం నాడే ఏకంగా 7,559 మంది ఆర్థిక సాయాన్ని కోరుతూ అన్ని జిల్లాల్లోను దరఖాస్తులు చేసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు, తమ మేనిఫెస్టోలో కూడా ఆటో, […]

ఆటో డ్రైవర్ల ఆర్థిక సాయానికి దరఖాస్తుల వెల్లువ... అత్యధికంగా కృష్ణా జిల్లా నుంచే...
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో, కారు డ్రైవర్ కమ్ ఓవర్ లకు ఇస్తామని ప్రకటించిన పది వేల రూపాయల ఆర్ధిక సాయానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. శనివారం నుంచి ఈ ఆర్థిక సాయం కోసం ఈ నెల 25 వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.

దీంతో ఒక్క శనివారం నాడే ఏకంగా 7,559 మంది ఆర్థిక సాయాన్ని కోరుతూ అన్ని జిల్లాల్లోను దరఖాస్తులు చేసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు, తమ మేనిఫెస్టోలో కూడా ఆటో, కారు డ్రైవర్ కమ్ ఓవర్ లకు పది వేల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.

ఈ నూతన పథకానికి విధి విధానాలను ప్రకటించింది ప్రభుత్వం.

శనివారం నుంచి ఈ నెల 25 వ తేదీ వరకూ దరఖాస్తులు చేసుకోవాలని గడువు విధించింది. ఇందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించింది. దీంతో దరఖాస్తులు చేసుకోవడానికి తొలి రోజైన శనివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ఆటో, కారు డ్రైవర్ కమ్ ఓవర్లు దరఖాస్తు చేసుకుందుకు క్యూ కట్టారు. ఈ దరఖాస్తులను గ్రామ, వార్డు వాలంటీర్లు పరిశీలించిన అనంతరం ప్రభుత్వం వీరికి పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తుంది.

ఈ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు తెల్ల రేషన్‌ కార్డు, వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్, ఆధార్, డ్రైవింగ్‌ లైసెన్స్, రుణం లేని బ్యాంకు పాస్‌ పుస్తకం మొదటి పేజీ, కుల ధ్రువీకరణ పత్రం వంటి ప్రధాన ప్రతాల జిరాక్స్‌ కాపీలను దరఖాస్తుతో పాటు పొందుపరచాలి.

ఈ సాయం కోసం శనివారం నుంచి ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాల వారీగా శ్రీకాకుళంలో 458, విజయనగరం 437, విశాఖపట్నం 763, తూర్పు గోదావరి 833, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 759 దరఖాస్తులు వచ్చాయి.

ఇక రాష్ట్రంలోనే అత్యధికంగా కృష్ణా జిల్లా నుంచి 1,135 దరఖాస్తులు రావడం విశేషం. గుంటూరు జిల్లా నుంచి 602, ప్రకాశం నుంచి 307, నెల్లూరు నుంచి 540, చిత్తూరు నుంచి 441, వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి 447, కర్నూలు జిల్లా నుంచి 451, అనంతపురం నుంచి 386 మంది ఈ ఆర్థిక సాయం కోసం తొలిరోజు దరఖాస్తులు చేసుకున్నారు.

ఈ నెల 25 వ తేదీ నాటికి దరఖాస్తులను క్షుణంగా పరిశీలించి అర్హులైన వారందరికీ ఆర్థిక సాయం అందజేస్తామని రవాణా శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

First Published:  15 Sep 2019 12:14 AM GMT
Next Story