Telugu Global
NEWS

మరో పదేళ్లు నేనే సీఎం

“మరో పదేళ్లు నేనే ముఖ్యమంత్రిని. గిప్పుడు నాకు 66 సంవత్సరాలు. మరో పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండలేనా. నేను పోతానని, నా కొడుకుని ముఖ్యమంత్రి చేస్తానని సానా మంది అంటున్నారు. అవన్నీ శుద్ధ అబద్దం. వచ్చేసారి, ఆ పై వచ్చేసారి కూడా నేనే ముఖ్యమంత్రిని” అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. నేను ప్రజల కోసం కష్టపడుతున్నా. ఆ విపక్షాలకు తెలియలేదు కాని, ప్రజలకు తెలిసిందని, వారే తనను మరో పదేళ్లు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెడతారని […]

మరో పదేళ్లు నేనే సీఎం
X

“మరో పదేళ్లు నేనే ముఖ్యమంత్రిని. గిప్పుడు నాకు 66 సంవత్సరాలు. మరో పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండలేనా. నేను పోతానని, నా కొడుకుని ముఖ్యమంత్రి చేస్తానని సానా మంది అంటున్నారు. అవన్నీ శుద్ధ అబద్దం. వచ్చేసారి, ఆ పై వచ్చేసారి కూడా నేనే ముఖ్యమంత్రిని” అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు.

నేను ప్రజల కోసం కష్టపడుతున్నా. ఆ విపక్షాలకు తెలియలేదు కాని, ప్రజలకు తెలిసిందని, వారే తనను మరో పదేళ్లు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెడతారని కేసీఆర్ అన్నారు.

“నాకు చాలా మంది స్నేహితులున్నారు. నేను అనారోగ్యంగా ఉన్నానని, అమెరికా బోయి వైద్యం చేయించుకుంటానని అంటున్నారు. ఈ మాట 20 ఏళ్లుగా వింటున్నాను. నేను ఎక్కడికీ బోను” అని ఆయన శాసనసభలో ప్రకటించారు.

ఆదివారం తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైనింగ్ పై ముఖ్యమంత్రిపై పలు ఆరోణలు చేశారు. దీనికి సమాధానంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు మాట్లాడుతూ “ఎవరెన్ని శాపాలు పెట్టినా నేను గట్టిగానే ఉంటా. ప్రజల కోసం పని చేస్తునే ఉంటా” అని ఆయన అన్నారు.

చిల్లర రాజకీయాల కోసం సొంత రాష్ట్ర్రానికి శాపనార్ధాలు పెట్టరాదని, ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సహించరని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం రైతులకు నీళ్లిచ్చిందని, గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా బాబ్లీని బూచిగా చూపించి లొల్లి చేశారని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం కాంగ్రెస్ పక్షనేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ…. “ముఖ్యమంత్రి ఆరోగ్యంగా ఉండాలి. ఆయనకు ఏదైనా కావాలని కోరుకోవడం దుర్మార్గం. సీఎం నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి. ఆయన పాలనలో రాష్ట్రం బాగుండాలి” అని తాను కోరుకుంటున్నానన్నారు.

First Published:  15 Sep 2019 9:31 PM GMT
Next Story