Telugu Global
NEWS

అమరావతి కాదు... ముందు సీమకు నీళ్లు ఇవ్వండి అని బాబుకు చెప్పా...

గోదావరి- కృష్ణా నదుల అనుసంధానంపై రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకెళ్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన… ఈ అంశంపై త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డితో భేటీ కాబోతున్నట్టు చెప్పారు. ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ, నెల్లూరు జిల్లాలతో పాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాలకు నదుల అనుసంధానం వల్ల మంచి జరుగుతుందన్నారు. గతంలో చంద్రబాబు అమరావతి కోసం 53వేల కోట్లు ఖర్చు […]

అమరావతి కాదు... ముందు సీమకు నీళ్లు ఇవ్వండి అని బాబుకు చెప్పా...
X

గోదావరి- కృష్ణా నదుల అనుసంధానంపై రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకెళ్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన… ఈ అంశంపై త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డితో భేటీ కాబోతున్నట్టు చెప్పారు. ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ, నెల్లూరు జిల్లాలతో పాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాలకు నదుల అనుసంధానం వల్ల మంచి జరుగుతుందన్నారు.

గతంలో చంద్రబాబు అమరావతి కోసం 53వేల కోట్లు ఖర్చు పెడుతానని చెప్పినప్పుడు… రాజధానికి అంత డబ్బు వద్దని… ఆ సొమ్ముతో రాయలసీమ ప్రాంతానికి నీరు అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా చంద్రబాబుకు సూచించానని కేసీఆర్‌ చెప్పారు. కానీ చంద్రబాబు వినలేదన్నారు.

ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉందన్నారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో నీటి ఇబ్బందులున్న జిల్లాలను సస్యశ్యామలం చేయబోతున్నట్టు చెప్పారు.

ఒక పూట లేటైనా ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మాత్రం పూర్తవుతుందన్నారు. వైఎస్‌ రైతు పక్షపాతేనని… కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. నదుల అనుసంధానంపై ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందాలు ఖరారైన తర్వాత ప్రతిపక్షాలను కూడా పిలిచి… ఆ తర్వాత సంతకాలు చేస్తామని కేసీఆర్‌ చెప్పారు.

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాల వల్ల అన్నం పెడుతున్న కృష్ణా జలాలు కలుషితం అవడంతో పాటు హైదరాబాద్‌కు తాగునీటి ఇబ్బంది కూడా వస్తుందన్నారు. అందువల్ల తవ్వకాలకు అంగీకరించబోమన్నారు. ఒకవేళ కేంద్రం మొండిగా ముందుకెళ్తే అన్ని పక్షాలతో కలిసి తాము కూడా నల్లమల కోసం పోరాటం చేస్తామని సీఎం అసెంబ్లీలో చెప్పారు.

First Published:  15 Sep 2019 9:55 PM GMT
Next Story