పెళ్లి వాయిదా…. నయనతార భయం ఇదా?

లేడీ సూపర్ స్టార్ నయనతార చేతిలో ప్రస్తుతం చాలానే పెద్ద సినిమాలు ఉన్నాయి. తెలుగులో మెగాస్టార్ ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ లో హీరోయిన్ గా నటిస్తున్న ఈమె…. తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న ‘బిజిల్’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. రెండు సినిమాలు అక్టోబర్ లో విడుదల కాబోతున్నాయి.

ఇక గత కొంతకాలంగా నయనతార తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆఖరులో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం నయనతారకి ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న నయన్…. ఈ సమయంలో ఒకవేళ పెళ్లి చేసుకుంటే తనకి ఆఫర్లు తగ్గిపోతాయేమోనని భయపడుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే విగ్నేష్ ని కూడా పెళ్ళికి కొంతకాలం ఆగమని కన్విన్స్ చేస్తోందట. విగ్నేష్ కూడా నయనతార కోరికమేరకు ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకున్నాడట.