Telugu Global
Cinema & Entertainment

సందీప్ నెక్ట్స్.... రణబీర్ కపూర్‌ తో?

సందీప్ వంగ మొదటి సినిమా ‘అర్జున్ రెడ్డి’తోనే బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఆ తరువాత అదే సినిమాను హిందీలో కూడా రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బాస్టర్ కొట్టాడు. తెలుగులో విజయ్ దేవరకొండ, హిందీలో షాహిద్ కపూర్ హీరోలు గా నటించిన ఈ రెండు సినిమాలు రివ్యూలతో సంబంధం లేకుండా…. బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి. దీంతో సందీప్ తదుపరి సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. సందీప్ తన తదుపరి సినిమాను […]

సందీప్ నెక్ట్స్.... రణబీర్ కపూర్‌ తో?
X

సందీప్ వంగ మొదటి సినిమా ‘అర్జున్ రెడ్డి’తోనే బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఆ తరువాత అదే సినిమాను హిందీలో కూడా రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బాస్టర్ కొట్టాడు.

తెలుగులో విజయ్ దేవరకొండ, హిందీలో షాహిద్ కపూర్ హీరోలు గా నటించిన ఈ రెండు సినిమాలు రివ్యూలతో సంబంధం లేకుండా…. బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి.

దీంతో సందీప్ తదుపరి సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. సందీప్ తన తదుపరి సినిమాను తెలుగులో తీస్తాడా లేక హిందీలో తీస్తాడా? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ ప్రశ్నలకు పులిస్టాప్ పడినట్లేనని అర్థమౌతోంది.

తాజా సమాచారం ప్రకారం సందీప్ మళ్లీ బాలీవుడ్ లోనే సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోగా రణబీర్ కపూర్ ను ఫైనలైజ్ చేసినట్లు సమాచారం.

‘కబీర్ సింగ్’ బ్లాక్ బస్టర్ అవడంతో రణబీర్ కపూర్‌ కూడా సందీప్ తో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట. ఈ సినిమాకి ‘డెవిల్’ అనే ఒక ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారని చెబుతున్నారు. టైటిల్ కి తగ్గట్టుగానే రణబీర్ కపూర్‌ పాత్ర కి ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది.

అయితే ఇంతకు ముందు మహేష్ బాబు ఈ కథ విన్నాడని, కానీ తన ఇమేజ్ కి ఆ పాత్ర సెట్ అవకపోవడంతో వెనక్కి తగ్గాడని తెలుస్తోంది. మరోవైపు కథలో కొత్తదనం ఉండడంతో రణబీర్ కపూర్‌ ఈ సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకున్నాడని చెబుతున్నారు.

First Published:  16 Sep 2019 1:02 AM GMT
Next Story