‘అల వైకుంఠపురంలో’…. నెక్ట్స్ షెడ్యూల్ అక్కడే !

‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడవ సినిమా ‘అల వైకుంఠపురంలో’. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా కి సంబందించి రెండు షెడ్యూల్స్ పూర్తి కాగా, తాజాగా మూడవ షెడ్యూల్ కోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక ప్రత్యేకమైన సెట్ ని నిర్మిస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర బృందం త్వరలో అంటే అక్టోబర్ మొదటి వారంలో పారిస్ కి వెళ్ళనుంది. ఇక్కడ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు, రెండు పాటల ను చిత్రీకరించనున్నారు. గీత ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

టబు, నవదీప్, సుశాంత్ మరియు నివేదా పేతురాజ్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో క్లాష్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.