Telugu Global
Cinema & Entertainment

'బాగీ' సిరీస్... మరో తెలుగు సినిమా రీమేక్...

బాలీవుడ్ లో టైగర్ ష్రఫ్ హీరోగా నటించిన ‘బాగీ’ సిరీస్ చాలా పాపులర్. ఇప్పటిదాకా ఈ సిరీస్ లోని రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్స్ గా నిలిచాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… రెండు సినిమాలు తెలుగు రీమేక్ లే కావడం విశేషం. ‘బాగీ’ సినిమా తెలుగులో ప్రభాస్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించి సూపర్ హిట్ అయిన ‘వర్షం’ సినిమాకి రీమేక్ గా విడుదల కాగా, ‘బాగీ 2’ అడవి శేష్ ‘క్షణం’ సినిమాకి […]

బాగీ సిరీస్... మరో తెలుగు సినిమా రీమేక్...
X

బాలీవుడ్ లో టైగర్ ష్రఫ్ హీరోగా నటించిన ‘బాగీ’ సిరీస్ చాలా పాపులర్. ఇప్పటిదాకా ఈ సిరీస్ లోని రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్స్ గా నిలిచాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… రెండు సినిమాలు తెలుగు రీమేక్ లే కావడం విశేషం.

‘బాగీ’ సినిమా తెలుగులో ప్రభాస్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించి సూపర్ హిట్ అయిన ‘వర్షం’ సినిమాకి రీమేక్ గా విడుదల కాగా, ‘బాగీ 2’ అడవి శేష్ ‘క్షణం’ సినిమాకి రీమేక్ గా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.

తాజాగా ఇప్పుడు ‘బాగీ 3’ సినిమాతో త్వరలో టైగర్ ష్రఫ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కూడా ఒక రీమేక్ అని సమాచారం.

తెలుగులో నాగచైతన్య, సునీల్ కలిసి నటించిన ‘తడాఖా’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందట. తమన్నా, ఆండ్రియా హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది.

ఇప్పుడు ఈ సినిమాని హిందీలో టైగర్ ష్రఫ్ ‘బాగీ 3’ గా రీమేక్ చేయబోతున్నారు. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అన్నయ్య పాత్రలో రితేష్ దేశ్ ముఖ్ కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

‘బాగీ’ సినిమా లో టైగర్ ష్రఫ్ తో రొమాన్స్ చేసిన శ్రద్ధ కపూర్ ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు హిందీలో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

First Published:  17 Sep 2019 9:09 AM GMT
Next Story