Telugu Global
National

ఫరూక్‌పై కఠినమైన పీఎస్ఏ యాక్ట్ ప్రయోగం...

కశ్మీర్‌ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి వస్తున్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే కశ్మీర్‌ నేతలు, ప్రజలు పలు ఆంక్షల మధ్య బతుకుతున్నారు. ఈనేపథ్యంలోనే కేంద్రం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాపై కఠినమైన చట్టంగా పేరున్న ప్రజా భద్రత చట్టం – పీఎస్‌ఏను ప్రయోగించింది. దాంతో అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ చట్టం కింద ఎవరినైనా సరే కనీస విచారణ లేకుండానే రెండేళ్లపాటు జైలులో ఉంచవచ్చు. ఈ చట్టాన్ని తెచ్చింది కూడా […]

ఫరూక్‌పై కఠినమైన పీఎస్ఏ యాక్ట్ ప్రయోగం...
X

కశ్మీర్‌ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి వస్తున్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే కశ్మీర్‌ నేతలు, ప్రజలు పలు ఆంక్షల మధ్య బతుకుతున్నారు. ఈనేపథ్యంలోనే కేంద్రం మరో కఠిన నిర్ణయం తీసుకుంది.

మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాపై కఠినమైన చట్టంగా పేరున్న ప్రజా భద్రత చట్టం – పీఎస్‌ఏను ప్రయోగించింది. దాంతో అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ చట్టం కింద ఎవరినైనా సరే కనీస విచారణ లేకుండానే రెండేళ్లపాటు జైలులో ఉంచవచ్చు.

ఈ చట్టాన్ని తెచ్చింది కూడా ఫరూక్ తండ్రి షేక్ అబ్దుల్లానే. కలప స్మగ్లర్లను కట్టడి చేసేందుకు తెచ్చిన ఈ చట్టాన్ని కేంద్రం ఫరూక్ అబ్దుల్లాపై ప్రయోగించింది. అరెస్ట్ చేసిన వెంటనే శ్రీనగర్‌లోని ఫరూక్ నివాసాన్నే జైలుగా…. అధికారులు అందులోనే ఫరూక్‌ను ఉంచారు. ఇంటి చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి…. భారీగా పోలీసులు మోహరించారు. ఫరూక్ వయసు 81 ఏళ్లు. ఆయన కుమారుడు ఓమర్‌ అబ్దుల్లా కూడా గత నెల 5 నుంచి గృహనిర్బంధంలోనే ఉన్నాడు.

అటు కశ్మీర్‌లో పరిస్థితులపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులను నెలకొల్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆంక్షల కారణంగా అక్కడి ప్రజలు ఆ రాష్ట్ర హైకోర్టును కూడా ఆశ్రయించలేకపోతున్నారన్న ఆరోపణలను తాము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని సుప్రీం కోర్టు చెప్పింది.

వీలైనంత త్వరగా పరిస్థితులను చక్కదిద్దాలని … అవసరమైతే తానే స్వయంగా శ్రీనగర్‌లో పర్యటిస్తానని సీజే రంజన్ గొగొయ్‌ వ్యాఖ్యానించారు.

First Published:  16 Sep 2019 9:52 PM GMT
Next Story