Telugu Global
Cinema & Entertainment

మంచు లక్ష్మి.... సెలబ్రిటీల గుట్టు విప్పేనా !

సెలబ్రిటీల గురించి, వారి జీవితాల గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీలు నిజ జీవితంలో ఎలా ఉంటారు… ఏం చేస్తుంటారు…. అని తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఆసక్తి చూపిస్తారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు ఒక సరికొత్త సెలబ్రిటీ టాక్ షో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ షో బాలీవుడ్ లో బాగానే పాపులర్ అయ్యింది. సెలబ్రిటీల నైట్ లైఫ్ ఎలా ఉంటుంది అనే విషయంపై ఈ టాక్ […]

మంచు లక్ష్మి.... సెలబ్రిటీల గుట్టు విప్పేనా !
X

సెలబ్రిటీల గురించి, వారి జీవితాల గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీలు నిజ జీవితంలో ఎలా ఉంటారు… ఏం చేస్తుంటారు…. అని తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఆసక్తి చూపిస్తారు.

అలాంటి వారి కోసమే ఇప్పుడు ఒక సరికొత్త సెలబ్రిటీ టాక్ షో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ షో బాలీవుడ్ లో బాగానే పాపులర్ అయ్యింది. సెలబ్రిటీల నైట్ లైఫ్ ఎలా ఉంటుంది అనే విషయంపై ఈ టాక్ షో ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు ఈ టాక్ షో తెలుగులో కూడా రాబోతోంది. దీనికి హోస్ట్ గా మంచు లక్ష్మి ఉండబోతోంది.

ఇప్పటికే లక్ష్మి టాక్ షో తో పాపులర్ అయిన మంచు లక్ష్మి…. ఇప్పుడు సెలబ్రిటీల నైట్ లైఫ్ ఎలా ఉండబోతుందో ప్రేక్షకులకి చూపించడానికి సిద్ధమవుతుంది. ఈనెల 23 నుంచి షో తెలుగు వర్షన్ ప్రసారం కాబోతోంది.

టాలీవుడ్ లో మంచు లక్ష్మి కి మంచి రిలేషన్సే ఉన్నాయి. కాబట్టి ఈ షోకి స్టార్ హీరో హీరోయిన్ లు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వీరి వల్ల ఈ షోకి ఫుల్ పబ్లిసిటి కూడా ఆటోమెటిక్ గా వచ్చేస్తుంది. చూడాలి….బాలీవుడ్ లో హిట్ అయిన ఈ షో తెలుగులో ఎలా ఉండబోతోందో..!

First Published:  17 Sep 2019 4:20 AM GMT
Next Story