Telugu Global
Cinema & Entertainment

వరల్డ్ ఫెమస్ లవర్ గా.... విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ హీరో గా క్రాంతి మాధవ్ దర్శకత్వం లో చాలా రోజుల క్రితమే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా…. లవ్ స్టోరీ అని, కొంచెం డిఫరెంట్ గా సినిమా కథ ఉంటుందని ముందు నుంచే చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రమోషన్ కి సంబంధించి ఏది రివీల్ చేయని దర్శక నిర్మాతలు… ఇప్పుడు తాజాగా సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా […]

వరల్డ్ ఫెమస్ లవర్ గా.... విజయ్ దేవరకొండ
X

విజయ్ దేవరకొండ హీరో గా క్రాంతి మాధవ్ దర్శకత్వం లో చాలా రోజుల క్రితమే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా…. లవ్ స్టోరీ అని, కొంచెం డిఫరెంట్ గా సినిమా కథ ఉంటుందని ముందు నుంచే చెబుతున్నారు దర్శక నిర్మాతలు.

ఇప్పటి వరకు ఈ సినిమా ప్రమోషన్ కి సంబంధించి ఏది రివీల్ చేయని దర్శక నిర్మాతలు… ఇప్పుడు తాజాగా సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా కి ‘వరల్డ్ ఫెమస్ లవర్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు.

ఇకపోతే ఈ సినిమా లో విజయ్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని చెబుతున్నారు. ఈ సినిమా లో రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌, క్యాథెరిన్, ఇజాబెల్లె దె హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. డియర్ కామ్రేడ్ తో అభిమానులని నిరాశ పరిచిన విజయ్ ఈ కొత్త సినిమా తో వాళ్ళని ఇంప్రెస్ చేయాలని అనుకుంటున్నాడు.

కె ఎస్ రామారావు ఈ సినిమా ని క్రియేటివ్ కమర్షియల్స్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తారట.

First Published:  17 Sep 2019 1:26 AM GMT
Next Story