బ్యాడ్ లక్ బాబు… ” నా పొలంలో మొలకలోచ్చాయ్” సీన్ మిస్ అయ్యాం…

ఎన్నికల ముందు చంద్రబాబు… మోడీకి వ్యతిరేకంగా మీడియా ముందు చేసిన విన్యాసాలు అన్నీఇన్నీ కావు. మోడీని దించేస్తా… బీజేపీని కరకర నమిలేస్తా అంటూ ఊగిపోయారు.

ఇక “మా బాబు నిద్ర లేచాడు దాక్కో మోడీ” అంటూ బాబు పత్రికలు ప్రదర్శించిన రచానావేశం చూసి “ఏదో అయ్యేలా ఉంది బయ్యా” అంటూ అమాయక పాఠకులు కూడా నమ్మేశారు. కానీ రిజల్ట్ వచ్చాక తెలిసింది…. బాబు ఆవేశం ఒక పులి వేషం అని.

మే23 న 11గంటలకు బాబు గారి మోడీ వ్యతిరేక గర్జన ఆగిపోయింది. అప్పటినుంచి గర్జన కాదు కదా గొనుగుడు కూడా లేదాయే. సుజన, సీఎం రమేష్ లు బీజేపీలో బెర్త్ సాధించే వరకు…. బాబు ముఖంలో నెత్తుటి చుక్క కూడా కనిపించేది కాదు.

అలా బీజేపీ, మోదీపై వలపుల వల విసరడం మొదలు పెట్టిన చంద్రబాబు… తాజాగా కొడుకు లోకేష్ తో కలిసి మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఎన్నికల ముందు పోరు పతాకాన్ని తాకుతున్నప్పుడు…. ఇలా ట్వీట్ చేసిన దాఖలాలు లేవు. అయితే ఇద్దరు బాబులకు మోడీ నుంచి ఘోర అవమానమే ఎదురైంది. కోపం తగ్గిందా లేదా అని చూసేందుకు బాబు చేసిన ట్వీట్ కు మోడీ నుంచి స్పందన లేదు.

జగన్, కేసిఆర్ మొదలుకొని సినిమా యాక్టర్స్ వరకు అందరికీ రిప్లై ఇచ్చిన మోడీ…. 40 ఇయర్స్ ఇండస్ట్రీని మాత్రం పూచిక పుల్లలా పట్టించుకోలేదు. దాంతో బాబు మీద మోడీ ఫోకస్ తగ్గలేదన్నది స్పష్టమవుతోంది.

అదే ఒక వేళ మోడీ గనుక బాబు ట్వీట్ కు స్పందించి ఉంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమాలో “నా పొలంలో మొలకలోచ్చాయ్ “అంటూ హీరో గంతులేసినట్టు మీడియా కూడా “మా బాబు ట్వీట్ కు మోడీ స్పందించారహో” అంటూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కార్నివాల్ చేసి ఉండేది. కానీ బ్యాడ్ లక్ పులి వేషాలను ఇంకా మోడీ మరిచి పోయినట్టు లేరు.