గ్యాంగ్ లీడర్… నాలుగు రోజుల వసూళ్లు

నాని నటించిన గ్యాంగ్ లీడర్ కు పాజిటివ్ రివ్యూలు వచ్చినా… సోమవారం నుంచి ఆశించిన స్థాయి లో వసూళ్లు రాకపోవడం విశేషం. ఈ సినిమా వసూళ్లు భారీగా పడిపోయాయి.

ఇక ఈ సినిమా నాలుగు రోజుల్లో కేవలం 13 కోట్లు మాత్రమే రాబట్టింది. నాని స్థాయి కి ఇది తక్కువ అనే చెప్పుకోవాలి.

నైజాం: 5.20 కోట్లు
సీడెడ్: 1.60 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.73 కోట్లు
గుంటూరు: 1.15 కోట్లు
ఈస్ట్ గోదావరి: 1.13 కోట్లు
కృష్ణ: 1.01 కోట్లు
వెస్ట్ గోదావరి: 0.75 కోట్లు
నెల్లూరు: 40 లక్షలు
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నాలుగు రోజుల షేర్: 12.97 కోట్లు

విక్రమ్ కుమార్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా తో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది.  మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమా లో కార్తికేయ విలన్ గా నటించాడు.