ఆత్మహత్యకు ముందు కోడెల 22 ఫోన్ కాల్స్…. ఆ ఒక్క కాల్ పైనే అనుమానం

కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య వ్యవహారం సంచలనంగా మారడంతో…. హైదరాబాద్ పోలీసులు పూర్తిస్థాయిలో ఈ కేసు పై దృష్టి పెట్టారు. దర్యాప్తు వేగాన్ని పెంచారు. ఆయన ఫోన్ లో మాట్లాడాకే ఆత్మహత్య చేసుకోవడం.. ఆయన ఫోన్ మిస్సవ్వడం చూశాక అందరిలోనూ అనుమానాలు కలుగుతున్నాయి.

ఇక కోడెల కాల్ డేటాను పరిశీలించిన పోలీసులకు…. ఆశ్చర్యపోయే విషయాలు తెలిశాయట. గడిచిన 12 రోజులుగా కోడెల శివప్రసాద రావు బయటి వ్యక్తులతో ఫోన్ లో మాట్లాడడం లేదు.. కానీ సోమవారం మాత్రం ఆత్మహత్యకు ముందు సుమారు 22 ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు.

దీంతో ఈ 22 ఫోన్ కాల్స్, ఆ సంభాషణ చుట్టూనే పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

కోడెల సోమవారం ఉదయం ఎవరెవరికి ఫోన్లు చేశారనే విషయమై పోలీసులు ఆరాతీస్తున్నారు. మరో వైపు కోడెల శివప్రసాదరావు సెల్ పోన్ అదృశ్యం కావడంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ మొత్తం 22 ఫోన్ కాల్స్ ను ఆరాతీసిన పోలీసులు ఓ రెండు ఫోన్ నంబర్లపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఒక్క ఫోన్ నంబర్ తోనే 24 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆ ఫోన్ నంబర్లపై పోలీసులు ఆరాతీస్తున్నట్టు తెలుస్తోంది.