Telugu Global
International

పాక్ క్రికెటర్లకు ఇక బిర్యానీ బంద్

నయాకోచ్ మిస్బావుల్ హక్ హుకుం ఇంతకాలం వేడి వేడిగా బిర్యానీ, తీపితీపిగా స్వీట్లు తింటూ ఎంజాయ్ చేస్తూ వచ్చిన పాక్ క్రికెటర్ల నోట్లో నయాకోచ్ మిస్బావుల్ హక్ మట్టికొట్టాడు. స్వీట్లు తినడంతో పాటు బిర్యానీ తీసుకోడం బంద్ చేయాలంటూ హుకుం జారీ చేశాడు. పాక్ క్రికెటర్ల ఫిట్ నెస్ ప్రమాణాలు రానురాను దిగజారిపోడానికి మితిమీరి బిర్యానీ తినటం, అతిగా నూనె పదార్ధాలు, స్వీట్లు తీసుకోడమే కారణమని మిస్బావుల్ హక్ తేల్చిచెప్పాడు. పాక్ జాతీయ జట్లకు ఇక నుంచి నిర్వహించే శిక్షణ […]

పాక్ క్రికెటర్లకు ఇక బిర్యానీ బంద్
X
  • నయాకోచ్ మిస్బావుల్ హక్ హుకుం

ఇంతకాలం వేడి వేడిగా బిర్యానీ, తీపితీపిగా స్వీట్లు తింటూ ఎంజాయ్ చేస్తూ వచ్చిన పాక్ క్రికెటర్ల నోట్లో నయాకోచ్ మిస్బావుల్ హక్ మట్టికొట్టాడు.

స్వీట్లు తినడంతో పాటు బిర్యానీ తీసుకోడం బంద్ చేయాలంటూ హుకుం జారీ చేశాడు. పాక్ క్రికెటర్ల ఫిట్ నెస్ ప్రమాణాలు రానురాను దిగజారిపోడానికి మితిమీరి బిర్యానీ తినటం, అతిగా నూనె పదార్ధాలు, స్వీట్లు తీసుకోడమే కారణమని మిస్బావుల్ హక్ తేల్చిచెప్పాడు.

పాక్ జాతీయ జట్లకు ఇక నుంచి నిర్వహించే శిక్షణ శిబిరాలలో అందించే ఆహారంలో బిర్యానీ, నూనెలతో చేసిన వంటలు, స్వీట్లు ఉండరాదని ఆదేశించాడు.

పాక్ క్రికెటర్లకు పౌష్టిక ఆహారం అందుబాటులో ఉంచడం ద్వారా ఫిట్ నెస్ ప్రమాణాలు పెంచవచ్చునని..తద్వారా క్రికెట్ ప్రమాణాలు పెరుగుతాయని ప్రకటించాడు.

ఇంగ్లండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్ టోర్నీ లీగ్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో తమ జట్టు ఓటమికి తగిన ఫిట్ నెస్ లేకపోడమే కారణమని పాక్ టీమ్ మేనేజ్ మెంట్ బయటపెట్టడంతో…చీఫ్ కోచ్ గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన మిస్బావుల్ హక్…ఆహార నియమాలలో భారీగా మార్పులు చేయాలని నిర్ణయించాడు.

అంతర్జాతీయ క్రికెట్లో ఆశించిన ఫలితాలు సాధించే వరకూ పాక్ క్రికెటర్లు బిర్యానీ వాసన పీల్చుతూ బతకాల్సిందే మరి.

First Published:  17 Sep 2019 11:46 PM GMT
Next Story