Telugu Global
Cinema & Entertainment

సుకుమార్... అప్పుడు సమంతతో... ఇప్పుడు రష్మికతో...

రంగస్థలం సినిమాలో సమంత చేసిన రామలక్ష్మి పాత్రకి… చాలా మంచి పేరు వచ్చింది. ఈ పాత్ర కి సమంత బాగా సెట్ అయింది. అది పక్కన పెడితే ఇప్పుడు అలాంటి ఒక పాత్ర లో నే రష్మిక కూడా నటిచనుందట. అది కూడా సుకుమార్ దర్శకత్వం లోనే. సుకుమార్ దర్శకుడి గా అల్లు అర్జున్ హీరో గా ఒక రొమాంటిక్ యాక్షన్ డ్రామా సినిమా రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా లో రష్మిక హీరోయిన్ అనే […]

సుకుమార్... అప్పుడు సమంతతో... ఇప్పుడు రష్మికతో...
X

రంగస్థలం సినిమాలో సమంత చేసిన రామలక్ష్మి పాత్రకి… చాలా మంచి పేరు వచ్చింది. ఈ పాత్ర కి సమంత బాగా సెట్ అయింది. అది పక్కన పెడితే ఇప్పుడు అలాంటి ఒక పాత్ర లో నే రష్మిక కూడా నటిచనుందట. అది కూడా సుకుమార్ దర్శకత్వం లోనే.

సుకుమార్ దర్శకుడి గా అల్లు అర్జున్ హీరో గా ఒక రొమాంటిక్ యాక్షన్ డ్రామా సినిమా రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా లో రష్మిక హీరోయిన్ అనే విషయం కూడా ఎప్పుడో చెప్పేసారు దర్శక నిర్మాతలు.

ఇక ఈ సినిమా లో రష్మిక పాత్ర కూడా గ్రామీణ నేపథ్యం తో ఉండనుందట. పాత్ర కి తగ్గట్టుగానే రష్మిక చాలా డిఫరెంట్ గా కనిపించబోతోందట. సినిమాలో రష్మికది పవర్ ఫుల్ పాత్ర అని అంటున్నారు.

ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో మొదలవుతుందని సమాచారం. ఇప్పటి వరకు రష్మిక చేసిన పాత్రలు ఒక ఎత్తు అయితే, ఈ సినిమా లో రష్మిక చేస్తున్న పాత్రకి ఖచ్చితంగా మంచి పేరు వస్తుందని అంటున్నారు.

First Published:  18 Sep 2019 5:11 AM GMT
Next Story