Telugu Global
Cinema & Entertainment

'సై రా' క్రేజ్: ఇక్కడే కాదు... అక్కడ కూడా..!

మెగాస్టార్ చిరంజీవి భారీ బడ్జెట్ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ గురించి కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా బాలీవుడ్ మరియు కోలీవుడ్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళంలో కూడా సినిమాకి బాగానే క్రేజ్ ఉంది. దానికి కారణం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించడం. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ‘సైరా’ సినిమాని తెలుగులో కూడా విడుదల చేయబోతోంది. ఈ నేపథ్యంలో […]

సై రా క్రేజ్: ఇక్కడే కాదు... అక్కడ కూడా..!
X

మెగాస్టార్ చిరంజీవి భారీ బడ్జెట్ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ గురించి కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా బాలీవుడ్ మరియు కోలీవుడ్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళంలో కూడా సినిమాకి బాగానే క్రేజ్ ఉంది. దానికి కారణం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించడం.

తాజా సమాచారం ప్రకారం ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ‘సైరా’ సినిమాని తెలుగులో కూడా విడుదల చేయబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమాని కేవలం తెలుగు, హిందీ లో మాత్రమే కాకుండా తమిళంలో కూడా అదే రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలో త్వరలో ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఈవెంట్ ని చెన్నైలో కూడా నిర్వహించనున్నారు.

విజయ్ సేతుపతి మాత్రమే కాకుండా సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించడం మరింత ప్లస్ అయింది. అమితాబచ్చన్, సుదీప్ వంటి వారి వల్ల కూడా సినిమాకి ఇతర భాషల్లో మంచి మార్కెట్ లభించింది.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది.

First Published:  18 Sep 2019 12:00 AM GMT
Next Story