సైరా ట్రైలర్ రివ్యూ

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సైరా ట్రయిలర్ రానే వచ్చింది. వస్తూనే యూట్యూబ్ దుమ్ముదులిపింది ట్రయిలర్. రామ్ చరణ్ పెట్టిన ఖర్చు, చిరంజీవి స్టామినా, సురేందర్ రెడ్డి టేకింగ్ మొత్తం ట్రయిలర్ లో కనిపించింది. మొత్తంగా చూసుకుంటే 2 నిమిషాల 54 సెకెన్ల రన్ టైమ్ ఉన్న ట్రయిలర్ అదిరింది.

‘అతడు కారణజన్ముడు’ అనే డైలాగ్ తో ప్రారంభమైన ట్రయిలర్.. సైరా నరసింహారెడ్డి స్వతంత్ర పోరాటం చుట్టూ తిరిగింది. మధ్యలో నరసింహారెడ్డి వ్యక్తిగత జీవితాన్ని కూడా టచ్ చేశారు. అసలు సైరా నరసింహారెడ్డి పోరాటం ఎక్కడ ప్రారంభమైందనే విషయంపై కూడా ట్రయిలర్ లో చిన్న స్పష్టత ఇచ్చారు.

నిజజీవితంలో నరసింహారెడ్డిని మధ్యతరగతి వ్యక్తిగా చెబుతారు.. కానీ సినిమాలో మాత్రం అతడ్ని ధనవంతుడిగా చూపించారు. చిరంజీవితో పాటు సినిమాలో ప్రధాన తారాగణం మొత్తం ట్రయిలర్ లో కనిపించింది. వాళ్ల డైలాగ్స్ కూడా పెట్టడం విశేషం. సినిమాలో చిన్న పాత్ర పోషించిన నిహారికకు కూడా ట్రయిలర్ లో చోటు దక్కింది.

ఇక టెక్నికల్ గా చూస్తే సైరా హై-స్టాండర్డ్స్ లో ఉంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ సహకారంతో తీసిన యుద్ధ సన్నివేశాలు బాగున్నాయి. కమల్ కన్నన్ కంపోజ్ చేసిన గ్రాఫిక్స్ కూడా రిచ్ గా ఉన్నాయి. రాజీవన్ ప్రొడక్షన్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది సైరా.