సైరా కోసం 125 కోట్లు….

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. అనుకున్నట్టుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను జీ టీవీ 125 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అమితాబచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, తమన్నా సుదీప్ వంటి నటీ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తుండడంతో సినిమాకి కేవలం టాలీవుడ్ లోనే కాక మిగతా భాషల్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది.

కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. టీజర్ తోనే అంచనాలని భారీగా పెంచేసిన దర్శక నిర్మాతలు ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు.