శరీరాలు వేరైనా తమ మనసులు ఒకటే…. పవన్ పై బండ్ల గణేష్‌ పొగడ్తల వర్షం 

తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే 7ఓ క్లాక్ బ్లేడుతో గొంతు కోసుకుంటానని సంచలనం సృష్టించిన టాలీవుడ్ కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్…. ఆ తర్వాత కాంగ్రెస్ కు దూరంగా…. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటిస్తున్నాడు.

చాలా రోజులుగా రాజకీయ కామెంట్లకు, రాజకీయాలకు దూరంగా ఉన్న బండ్ల గణేష్ మళ్లీ రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు.

తాజాగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ స్వచ్ఛమైన వ్యక్తి అని.. ఏదో ఒక రోజు పవన్ ముఖ్యమంత్రి అవుతాడని’  అన్నాడు. పవన్ ను భగవంతుడు తయారు చేసిన అరుదైన వ్యక్తి అంటూ ఓ రేంజ్ లో బండ్ల పొగడ్తల వర్షం కురిపించారు.

పవన్ కు , తనకు మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని.. శరీరాలు వేరైనా తమ మనసులు ఒకటేనని బండ్ల చెప్పుకొచ్చాడు. పవన్ లోని ఆవేశం, ఆవేదన అంతా రాష్ట్ర ప్రజల కోసమేనని బండ్ల చెప్పుకొచ్చాడు. ముఖ్యమంత్రికి కావలసిన అన్ని అర్హతలు పవన్ కు ఉన్నాయని తెలిపాడు.

ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మళ్లీ కమెడియన్ గా రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పుడు పవన్ ను పొగిడేసి మళ్లీ వార్తల్లో నిలిచారు.