చిరంజీవి బయోపిక్…. ఆ ఛాన్స్ నాకే కావాలి

చిరంజీవి బయోపిక్ లో లీడ్ రోల్ చేసే అవకాశం వస్తే వదలనంటున్నాడు హీరో వరుణ్ తేజ్. అవసరమైతే చిరంజీవి మేకోవర్ కోసం ఎంత కష్టపడ్డానికైనా సిద్ధం అంటున్నాడు. హరీష్ శంకర్ చిరంజీవి బయోపిక్ ప్లాన్ చేస్తున్నాడని, అందులో తనకు మాత్రం వేషం ఇవ్వడానికి అతడు ఇష్టపడడం లేదని స్పష్టంచేశాడు.

“హరీష్ మైండ్ లో చిరంజీవి బయోపిక్ ఉంది. ఎప్పటికైనా బయోపిక్ చేస్తానంటున్నాడు. కానీ తనతో మాత్రం చేయనంటున్నాడు. నిజానికి చిరంజీవి బయోపిక్ చేయడానికి రామ్ చరణ్ మాత్రమే అర్హుడు. చరణ్ అన్న చేయనంటే మాత్రం నేను రెడీ.”

ఇలా చిరంజీవి బయోపిక్ అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చాడు వరుణ్ తేజ్. వాల్మీకి ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకున్నాడు. మరోవైపు వెంకీతో చేయాల్సిన ఎఫ్2 సీక్వెల్ పై కూడా రియాక్ట్ అయ్యాడు.

“వెంకటేశ్, నేను చాలా రెగ్యులర్ గా కలుస్తాం. బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. వెంకీ గారు, నేను కలిసి ఎఫ్3 చేస్తామా లేదా అనేది చెప్పలేను కానీ, కచ్చితంగా మా ఇద్దరి కాంబోలో మరో సినిమా మాత్రం గ్యారెంటీ. అనీల్ రావిపూడి, నేను మాట్లాడుకున్నప్పుడైతే ఎఫ్3 ఉంటుందనే ఎప్పుడూ అనుకుంటున్నాం.”

వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తమిళ జిగర్తాండాకు రీమేక్ గా వచ్చింది.