ఈసారి భయపెడుతున్న రానా….

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి దూరంగా ఉంటూ… కేవలం కంటెంట్ ఉన్న చిత్రాల్ని ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు రానా దగ్గుబాటి. తన కథ సెలక్షన్ తో ప్రేక్షకులను మెప్పించే రానా…. ఇప్పటికే ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘ఘాజి’ వంటి మంచి చిత్రాలను చేశాడు.

తాజాగా ఇప్పుడు రానా మరొక సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ‘గృహం’ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టిన దర్శకుడు మిళింద్ రావ్ ఇప్పుడు మరో హర్రర్ సినిమాతో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు.

ఈ సినిమాలో రానా హీరోగా నటిస్తున్నాడు. విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై గోపి ఆచంట ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

ఇప్పటికే రానా చేతిలో ‘1945’, ‘హాథి మేరే సాథి’ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు మిళింద్ రావ్ దర్శకత్వంలో రానా మరొక సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ నవంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి.