హృతిక్ రాముడు, దీపిక సీత…. ప్రభాస్ రావణుడు

బాలీవుడ్ దర్శకులు నితీష్ తివారి, రవి ఉద్యావార్ కలిసి ఒక సినిమా ని తెరకెక్కిస్తున్నారు. రామాయణ ఇతిహాసాన్ని సినిమా గా తెరకెక్కించబోతున్నట్లు ప్రకటన కూడా చేసారు.

అయితే ఈ సినిమా లో రాముడి పాత్ర కి హృతిక్ రోషన్… సీత పాత్ర కి దీపికా పదుకొణే ని తీసుకోవాలని అనుకుంటున్నారట.

అదేవిధంగా ఈ సినిమాలో కీలకం గా ఉండబోతున్న రావణాసురిడి పాత్ర లో ప్రభాస్ ని తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నారట. ప్రభాస్ రావణాసురుడి క్యారెక్టర్ కి బాగా సెట్ అవుతాడనే ఆలోచనలో ఉన్నారట వాళ్ళు.

ఇప్పటి వరకు ప్రభాస్ కానీ… చిత్ర యూనిట్ కానీ… ఈ వార్తలపై స్పందించలేదు…. కానీ అభిమానులు మాత్రం ప్రభాస్ ఒక స్ట్రైట్ హిందీ సినిమా లో నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఈ తరుణం లో ఈ ప్రాజెక్ట్ కచ్చితంగా మంచి డెబ్యూ అయ్యే అవకాశం ఉంది అని వారి ఆలోచన.

ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అల్లు అరవింద్, మధు మంతెన, నమిత మల్హోత్రా నిర్మించబోతున్నారు.