పూరి…. ఇస్మార్ట్ ప్లానింగ్

ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయం తో పూరి జగన్నాథ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. చాలా రోజుల తరువాత హిట్ అందుకోవడంతో…. వెంటనే మరో ప్రాజెక్ట్ పై ఫుల్ ఫోకస్ పెట్టాడు పూరి. ఎలాగైనా మరొక హిట్ కొట్టాలనే విధంగా తనపని తాను చేసుకుంటూ పోతున్నాడు.

ఇప్పటికే ‘ఫైటర్’ అనే సినిమాని విజయ్ దేవరకొండతో చేయబోతున్నట్లు ప్రకటించాడు పూరి. ఈ సినిమాను స్టార్ట్ చేయకముందే…. మరొక సినిమాను కూడా అనౌన్స్ చేయాలనేది పూరి ప్లాన్. వరుస విజయాలతో … పూర్వ వైభవం సంపాదించుకోవాలనేది పూరి జగన్నాథ్ ఆలోచనగా కనిపిస్తోంది.

ఇకపోతే ఫైటర్ షూటింగ్ అయిపోగానే…. ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా బాలకృష్ణ తో ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట పూరి. బాలకృష్ణ తో సినిమా చేసేందుకు నిర్మాత కూడా సిద్ధంగా ఉండటంతో 2020 లో కూడా ఫుల్ బిజీగా ఉండబోతున్నాడు. వీ ఆనంద్ ప్రసాద్ నిర్మాణం లో భవ్య క్రియేషన్స్ పై బాలకృష్ణ-పూరి సినిమా చేయాలనేది ప్లాన్. ఇంతకు ముందు పైసా వసూల్ చిత్రం కూడా ఈ కాంబినేషన్ లోనే వచ్చింది.