ఆర్ఆర్ఆర్ నిడివి ఎంతంటే….!

సినిమా పరిశ్రమలో క్లారిటీ ఉండే దర్శకులు చాలా తక్కువ మందే ఉంటారు. నటీనటుల నుంచి గానీ, టెక్నీషియన్ల నుంచి గానీ ఏం కావలి అనే విషయంలో చాలా క్లారిటీగా ఉంటాడు రాజమౌళి. అందుకే ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు.

ఇకపోతే బాహుబలి సినిమా విజయం తర్వాత రాజమౌళి రేంజ్ పూర్తి గా మారిపోయింది. ఒకప్పుడు కేవలం సౌత్ కి మాత్రమే పరిమితం అయిన తన క్రేజ్ ఇప్పుడు చాలా ఇండస్ట్రీలకీ పాకింది.

ఇక తన కొత్త చిత్రం ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే… ఇటీవలే ఎన్టీఆర్ తో ఒక షెడ్యూల్ పూర్తి చేసిన దర్శకుడు…. రామ్ చరణ్ కోసం ఎదురు చూస్తున్నాడు.

అయితే ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే…. రాజమౌళి సినిమాల్లో సాధారణం గా లాగ్ అనే పదానికి ఆస్కారం ఉండదు. తను ఎంచుకున్న కథ ని ఎంత నిడివి లో తీయాలి అనే విషయం మీద పక్కా క్లారిటీ తో ఉంటాడు.

ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రాన్ని కూడా రెండున్నర గంటల నిడివి లోపే తీసేయాలని రాజమౌళి భావిస్తున్నట్టు తెలుస్తోంది. బాహుబలి కథ పెద్దగా ఉన్నందున రెండు భాగాల్లో తెరకెక్కించిన రాజమౌళి…. ఇప్పుడు ఈ కథ ని మాత్రం తక్కువ నిడివి లో తీసేయాలని నిర్ణయించుకున్నాడట.

అదే నిజమైతే, ఆడియన్స్ కి అదొక సర్ ప్రైజ్ అనుకోవచ్చు. ఎందుకంటే అంత తక్కువ నిడివి లో రాజమౌళి ఇప్పటి వరకు ఏ సినిమా ని కూడా పూర్తి చేయలేదు… మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.