టీ-20 క్రికెట్లో విరాట్ కొహ్లీ టాప్

  • రోహిత్ శర్మ రికార్డును అధిగమించిన విరాట్
  • మొహాలీ టీ-20లో విరాట్ 72 పరుగుల నాటౌట్

భారత క్రికెట్ త్రీ-ఇన్-వన్ రన్ మెషీన్ విరాట్ కొహ్లీ ..ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో సైతం సరికొత్త రికార్డు నమోదు చేశాడు. భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ పేరుతో ఉన్న రికార్డును విరాట్ కొహ్లీ అధిగమించాడు.

మొహాలీ వేదికగా సౌతాఫ్రికాతో ముగిసిన రెండో టీ-20లో విరాట్ కొహ్లీ టాప్ స్కోరర్ గా నిలవడం ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు. కొహ్లీ కేవలం 52 బాల్స్ లోనే 3 సిక్సర్లు, 4 బౌండ్రీలతో 72 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచాడు. కొహ్లీ మొత్తం 22 హాఫ్ సెంచరీలతో 50.85 సగటు నమోదు చేశాడు.]

మూడేళ్ల క్రితం అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్ర్రేలియాపై 90 పరుగుల స్కోరు సాధించిన కొహ్లీ..ఆ తర్వాత మరో ధూమ్ ధామ్ హాఫ్ సెంచరీ సాధించడం ఇదే మొదటిసారి.

కొహ్లీ కెరియర్ లో ఇది 71వ టీ-20 మ్యాచ్ కాగా 2 వేల 441 పరుగులతో రోహిత్ శర్మ రికార్డును అధిగమించగలిగాడు. రోహిత్ 97 మ్యాచ్ ల్లో 2వేల 434 పరుగులు మాత్రమే సాధించాడు. అయితే ..నాలుగు సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు, 109 సిక్సర్లు సాధించిన ఘనత మాత్రం రోహిత్ శర్మకే సొంతం.

3, 4 స్థానాలలో కొహ్లీ, రోహిత్

టీ-20 చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల వరుసలో విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ 3, 4 స్థానాలలో ఉన్నారు.

న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 78 మ్యాచ్ ల్లో 2 వేల 283 పరుగులు, పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ 111 మ్యాచ్ ల్లో 2వేల 263 పరుగుల స్కోర్లతో మొదటి రెండుస్థానాలలో కొనసాగుతున్నారు.

విరాట్ కొహ్లీ 2వేల 441 పరుగులు, రోహిత్ 2వేల 434 పరుగులతో మూడు, నాలుగు స్థానాలలో నిలిచారు.