Telugu Global
National

పళనిస్వామి, స్టాలిన్ ఇద్దరి సిఫార్సులకు జగన్‌ ఓకే...

టీటీడీ బోర్డు సభ్యుల పేర్లను ఖరారు చేయడంతో ఏపీ సీఎం జగన్‌ అనేక ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. కేంద్ర మంత్రుల నుంచి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి కూడా సిఫార్సులు వచ్చాయి. అయితే అందరి విన్నపాలను గౌరవిస్తూ వీలైనంత వరకు జగన్ ప్రయత్నం చేశారు. పక్క రాష్ట్రాలతో సఖ్యతకు పెద్ద పీట వేసినట్టు కనిపిస్తుంది. 24 మంది నేరుగా, మరో నలుగురు ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా బోర్డులో ఉంటారు. తెలంగాణ నుంచి ఏడుగురికి బోర్డులో స్థానం కల్పించారు. అందులో […]

పళనిస్వామి, స్టాలిన్ ఇద్దరి సిఫార్సులకు జగన్‌ ఓకే...
X

టీటీడీ బోర్డు సభ్యుల పేర్లను ఖరారు చేయడంతో ఏపీ సీఎం జగన్‌ అనేక ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. కేంద్ర మంత్రుల నుంచి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి కూడా సిఫార్సులు వచ్చాయి. అయితే అందరి విన్నపాలను గౌరవిస్తూ వీలైనంత వరకు జగన్ ప్రయత్నం చేశారు. పక్క రాష్ట్రాలతో సఖ్యతకు పెద్ద పీట వేసినట్టు కనిపిస్తుంది. 24 మంది నేరుగా, మరో నలుగురు ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా బోర్డులో ఉంటారు.

తెలంగాణ నుంచి ఏడుగురికి బోర్డులో స్థానం కల్పించారు. అందులో కేసీఆర్‌కు సన్నిహతుడైన మైహోం గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వరరావు, వేల మందికి ఉద్యోగాలు కల్పించిన హెటిరో ఫార్మా ఎండీ బి. పార్థసారధి, కావేరి సీడ్స్ ఎండీ గుండవరం వెంకట భాస్కరరావు ఉన్నారు. నమస్తే తెలంగాణ పత్రిక సీఎండీ డి. దామోదరరావుకు కూడా స్థానం దక్కింది.

వైసీపీ పేరును రిజిస్ట్రేషన్ చేసిన కె. శివకుమార్‌కు, తొలి నుంచి తెలంగాణలో వైసీపీ తరపున పనిచేస్తున్న పుత్తా ప్రతాప్‌ రెడ్డికి టీటీడీ బోర్డులో స్థానం కల్పించారు. తమిళనాడు నుంచి ఈసారి నలుగురికి అవకాశం వచ్చారు.

ఇండియా సిమెంట్స్ ఎండీ ఎన్‌. శ్రీనివాసన్‌కు జగన్‌తో మంచి సంబంధాలుండడం కలిసి వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సిఫార్సు మేరకు అన్నాడీఎంకే ఎమ్మెల్యే కుమారగురుకు స్థానం కల్పించారు జగన్.

అదే సమయంలో తమిళనాడులో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న… రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా తమిళనాడు సీఎం అవుతారని భావిస్తున్న స్టాలిన్‌ సిఫార్సును కూడా జగన్ గౌరవించారు. స్థాలిన్ విజ్ఞప్తి మేరకు డాక్టర్ నిచిత ముప్పవరపును టీటీడీ బోర్డులో నియమించారు.

కర్నాటక నుంచి ముగ్గురికి స్థానం కల్పించగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా నారాయణమూర్తి మరోసారి అవకాశం దక్కించుకున్నారు.

మొత్తం మీద చూస్తే అటు తెలంగాణ నుంచి కేసీఆర్ ప్రతిపాదనలకు, తమిళనాడు, కర్నాటక ప్రభుత్వాల విజ్ఞప్తులకు జగన్‌ సానుకూలంగా స్పందించి ఆయా రాష్ట్రాలకు మంచి ప్రాధాన్యత ఇచ్చినట్టు అర్థమవుతోంది. పొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలను నెలకొల్పేందుకు ఈ తరహా నిర్ణయం తీసుకుని ఉండవచ్చు.

ఏపీ నుంచి పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పేరు తొలుత దాదాపు ఖాయమైనా… ఆఖరి నిమిషంలో ఆయనకు కొన్ని కారణాల వల్ల చోటు దక్కలేదు.

First Published:  19 Sep 2019 12:30 AM GMT
Next Story