ఆ సినిమా ఆగిపోలేదు…. వరుణ్ క్లారిటీ…

వాల్మీకి సినిమా కంటే ముందే…. అంటే వరుణ్ తేజ్ అంతరిక్షం సినిమా ని పూర్తి చేసిన తరువాత…. ఒక బాక్సింగ్ డ్రామా లో నటించనున్నాడని ఒక వార్త హల్ చల్ చేసింది. ఆ సినిమా లో వరుణ్ ఒక కిక్ బాక్సర్ గా నటించనున్నాడని…. కిరణ్ కొర్రపాటి దర్శకుడు ఈ సినిమా ని చేయనున్నాడు అనే టాక్ వచ్చింది.

వరుణ్ కూడా ఈ చిత్రం కోసం కొద్ది రోజులు బాక్సింగ్ లో శిక్షణ తీసుకున్నాడు. కానీ వాల్మీకి సినిమా మొదలైన వెంటనే ఈ బాక్సింగ్ సినిమా కి సంబంధించి ఒక్క అప్ డేట్ కూడా రాలేదు.

ఇకపోతే ఇప్పుడు వాల్మీకి సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ లో… వరుణ్ ని ఈ ప్రశ్నంచిగా… దానికి వరుణ్ ఒక క్లారిటీ ఇచ్చారు.

“చాలా మంది అనుకుంటున్నట్లుగా ఆ సినిమా ఆగిపోలేదు. కేవలం వాల్మీకి కోసం, ఈ సినిమా ని హోల్డ్ లో పెట్టాము అంతే. ఈ సినిమా కి సంబందించిన షూటింగ్ ని జనవరిలో మొదలు పెట్టనున్నాము. మరి కొద్దీ రోజుల్లో ఈ సినిమా కి సంబందించిన ప్రకటన ఒకటి వెలువడనుంది” అని వరుణ్ వివరణ ఇచ్చాడు.

ఈ సినిమా ని అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ నిర్మిస్తున్నాడు.