వినేశ్ పోగట్ కల నిజమాయెగా…!

  • ప్రపంచ పతకంతో ఒలింపిక్స్ బెర్త్

భారత మహిళా వస్తాదు వినేశ్ పోగట్ మూడవ ప్రయత్నంలో తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకోగలిగింది.

ఇప్పటికే ఆసియాక్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకాలు సాధించిన వినేశ్…ప్రపంచ కుస్తీ పోటీలలో సైతం కాంస్య పతకం సాధించడం ద్వారా తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోగలిగింది.

కజికిస్థాన్ లోని నూర్ సుల్తాన్ వేదికగా జరుగుతున్న 2019 ప్రపంచ కుస్తీ పోటీల మహిళల 53 కిలోల విభాగంలో పోటీకి దిగిన వినేశ్..కాంస్య పతకం సమరంలో… 8-2 పాయింట్లతో మారియా ప్లివరికోను చిత్తు చేసింది.

కాంస్యపతకం తో పాటు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ లో సైతం పాల్గొనటానికి అర్హత ఖాయం చేసుకోగలిగింది.

5వ భారత మహిళ వినేశ్…

ప్రపంచ కుస్తీ పోటీలలో పతకం సాధించిన 5వ భారత మహిళగా వినేశ్ పోగట్ రికార్డుల్లో చేరింది.

2006లో అల్కా తోమర్, 2012లో గీతా పోగట్, 2012లో బబిత పోగట్, 2018లో పూజా దండా ప్రపంచ పతకాలు సాధించగా…25 ఏళ్ల వినేశ్ 2019 ప్రపంచకుస్తీలో కాంస్యపతకం సాధించగలిగింది.