Telugu Global
NEWS

బాబు దూరం చేశాడు... జగన్ సెట్ చేశాడు...

చంద్రబాబు తీసుకున్న కొన్ని నిర్ణయాల వెనుక…. లోతుకు వెళ్తే గాని అసలు బాధితులు ఎవరన్నది అంతు చిక్కదు. తనకు ఓట్లు వేయని ప్రాంతాలను ఎలా టార్గెట్ చేయాలో బాబుకు బాగా తెలుసు. ముఖ్యంగా సీమ జనం అంటే బాబుకు మహా చెడ్డ చికాకు. ఆ విషయాన్ని బయట పెట్టేందుకు బాబు కూడా ఏనాడూ పెద్దగా సంశయించలేదు. ఆరోగ్య శ్రీ విషయంలో బాబు నిర్ణయం కూడా ఆ కోవలోకే వస్తుంది. చంద్రబాబు అధికారంలోకి రాగానే పక్క రాష్ట్రాల్లో వైద్యం […]

బాబు దూరం చేశాడు... జగన్ సెట్ చేశాడు...
X

చంద్రబాబు తీసుకున్న కొన్ని నిర్ణయాల వెనుక…. లోతుకు వెళ్తే గాని అసలు బాధితులు ఎవరన్నది అంతు చిక్కదు. తనకు ఓట్లు వేయని ప్రాంతాలను ఎలా టార్గెట్ చేయాలో బాబుకు బాగా తెలుసు. ముఖ్యంగా సీమ జనం అంటే బాబుకు మహా చెడ్డ చికాకు. ఆ విషయాన్ని బయట పెట్టేందుకు బాబు కూడా ఏనాడూ పెద్దగా సంశయించలేదు. ఆరోగ్య శ్రీ విషయంలో బాబు నిర్ణయం కూడా ఆ కోవలోకే వస్తుంది.

చంద్రబాబు అధికారంలోకి రాగానే పక్క రాష్ట్రాల్లో వైద్యం చేయించుకుంటే వారికి ఆరోగ్య శ్రీ వర్తించదు అని ప్రకటించారు. ఏపీలో సరైన ఆసుపత్రులు లేవు … కాబట్టి నిర్ణయం సరికాదని చెప్పినా వినలేదు. ఈ నిర్ణయం వల్ల బాగా ఇబ్బంది పడ్డవారు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు.

పెద్ద జబ్బులు వస్తే అప్పటి వరకు ఆయా జిల్లాల ప్రజలు పక్కనే ఉన్న చెన్నై, బెంగుళూర్, హైదరాబాద్ వెళ్లి వైద్యం చేయించుకునే వారు. కానీ బాబు దెబ్బకు పెద్ద జబ్బులు వచ్చిన సమయంలో జనం అల్లాడిపోయారు.

పెద్ద జబ్బులు వచ్చిన సమయంలో మెరుగైన వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లినా ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది అని కొత్త ప్రభుత్వం ప్రకటించడం ప్రజలకు పెద్ద ఊరట… ముఖ్యంగా సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు.

దీనికి తోడు తిరుపతి స్విమ్స్ కేంద్రంగా ఒక మెడికల్ వర్సిటీని ఏర్పాటు చేసి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని మెడికల్ కాలేజీ లను దాని కిందకు తీసుకు రావాలని జగన్ నిర్ణయించారు. ఇది మంచి నిర్ణయమే. ఒక విధంగా జగన్ పాలన వికేంద్రీకరణ మోడల్ కూడా ఇందులో కనిపిస్తుంది.

First Published:  19 Sep 2019 2:50 AM GMT
Next Story