సైరా ట్రైలర్ పై స్పందించిన…. సల్మాన్, అమీర్

సై రా నరసింహారెడ్డి సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే మొన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి భారీ స్పందన వస్తోంది. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ కూడా సినిమా ట్రైలర్ పై ట్విట్టర్ లో స్పందించారు.

ఇప్పటికే సల్మాన్ ఖాన్ ఈ సినిమా ట్రైలర్ గురించి ట్వీట్ చేస్తూ, “చరణ్ కి చిరంజీవి గారికి ఈ సినిమా మంచి విజయం అవ్వాలి అని కోరుకుంటున్నాను” అని చెప్పి ట్రైలర్ లింక్ ని షేర్ చేసాడు.

అలాగే నిన్న సాయంత్రం ఆమీర్ ఖాన్ ఈ సినిమా ట్రైలర్ లింక్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి ఈ ట్రైలర్ పై స్పందించాడు. “ఇప్పుడే సై రా సినిమా ట్రైలర్ ని చూశాను. భారీ బడ్జెట్ తో ఈ సినిమా ని చేశారు. నేను చిరంజీవి గారికి పెద్ద అభిమానిని. ఈ సినిమా చూడటానికి నేను వెయిట్ చేస్తున్నాను. చిరంజీవి సర్ కి, రామ్ చరణ్ కి మరియు సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు” అని పోస్ట్ చేశారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ని రామ్ చరణ్…  కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ  పై నిర్మించాడు.