Telugu Global
NEWS

ప్రపంచ బాక్సింగ్ ఫైనల్లో అమిత్ పంగాల్

భారత బాక్సర్ సరికొత్త చరిత్ర స్వర్ణానికి గురిపెట్టిన అమిత్ పంగాల్ భారత యువబాక్సర్ అమిత్ పంగాల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ బాక్సింగ్ ఫైనల్స్ చేరిన భారత తొలి బాక్సర్ గా నిలిచాడు. రష్యాలోని ఎక్ తెరీనాబర్గ్ వేదికగా జరుగుతున్న 2019 ప్రపంచ బాక్సింగ్ పురుషుల 52 కిలోల విభాగం ఫైనల్స్ కు అమిత్ అర్హత సాధించడం ద్వారా.. గోల్డ్ మెడల్ ఫైట్ కు సిద్ధమయ్యాడు. 52 కిలోల విభాగంలో ప్రపంచ రెండో ర్యాంక్ బాక్సర్ గా ఉన్న అమిత్ […]

ప్రపంచ బాక్సింగ్ ఫైనల్లో అమిత్ పంగాల్
X
  • భారత బాక్సర్ సరికొత్త చరిత్ర
  • స్వర్ణానికి గురిపెట్టిన అమిత్ పంగాల్

భారత యువబాక్సర్ అమిత్ పంగాల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ బాక్సింగ్ ఫైనల్స్ చేరిన భారత తొలి బాక్సర్ గా నిలిచాడు. రష్యాలోని ఎక్ తెరీనాబర్గ్ వేదికగా జరుగుతున్న 2019 ప్రపంచ బాక్సింగ్ పురుషుల 52 కిలోల విభాగం ఫైనల్స్ కు అమిత్ అర్హత సాధించడం ద్వారా.. గోల్డ్ మెడల్ ఫైట్ కు సిద్ధమయ్యాడు.

52 కిలోల విభాగంలో ప్రపంచ రెండో ర్యాంక్ బాక్సర్ గా ఉన్న అమిత్ పంగాల్ తొలి సెమీఫైనల్లో కజకిస్థాన్ స్టార్ బాక్సర్ సాకెన్ బిబోసినోవ్ ను 3-2తో అధిగమించి ఫైనల్స్ బెర్త్ సంపాదించాడు.

శనివారం జరిగే గోల్డ్ మెడల్ మ్యాచ్ లో ఉజ్బెక్ బాక్సర్, ఒలింపిక్ చాంపియన్ షకోబుద్దీన్ జోయిరోవ్ తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో భారత బాక్సర్లు ఇప్పటి వరకూ కాంస్య పతకాలకు మాత్రమే పరిమితమవుతూ వచ్చారు. ఆ రికార్డును అమిత్ పంగాల్ తిరగరాయాలన్న పట్టుదలతో ఉన్నాడు.

గతంలో ప్రపంచ బాక్సింగ్ పతకాలు సాధించిన భారత బాక్సర్లలో విజేందర్ సింగ్ ( 2009 ), వికాస్ కిషన్ ( 2011 ), శివ థాపా ( 2015 ), గౌరవ్ బిదూరీ ( 2017 ) మాత్రమే కాంస్యాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ప్రస్తుత టో్ర్నీ ఫైనల్లో అమిత్ పంగాల్ నెగ్గినా…ఓడినా అది సరికొత్త చరిత్రే అవుతుంది.

First Published:  20 Sep 2019 6:50 AM GMT
Next Story