పీటర్ హెయిన్స్ హీరో…. బెల్లంకొండ !

కొద్దిరోజుల క్రితమే ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దర్శకుడి గా మారబోతున్నాడు అనే వార్త సినీ వర్గాల్లో హల్ చల్ అయింది. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

ఫైట్ మాస్టర్ గా పీటర్ పారితోషికం చాలా ఎక్కువ. అంతే కాకుండా పీటర్ ఎప్పుడూ బిజీ గా ఉండే టెక్నీషియన్. వీటన్నింటినీ పక్కన పెట్టి…. దర్శకుడి గా మారేందుకు, తను రాసుకున్న స్క్రిప్ట్ ను ప్రొడ్యూసర్ నల్లమలపు బుజ్జి ని అప్రోచ్ అయ్యాడు. బుజ్జి కి కూడా కథ నచ్చడం తో వెంటనే సినిమా నిర్మించడానికి ఒప్పుకున్నాడట.

అయితే ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను తీసుకోబోతున్నారట. ఈ స్టార్ ఫైట్ మాస్టర్ ఇప్పటికే శ్రీనివాస్ ని కలిసి కథ ని చెప్పారట. అయితే బెల్లంకొండ ప్రస్తుతం రెండు సినిమాల తో బిజీ గా ఉండటం తో….. వచ్చే ఏడాది ద్వితీయార్థం లో సినిమా షూటింగ్ మొదలు పెడదామన్నాడట. ఆ లోపు ఈ సినిమాకి సంబంధించిన ఇతరపనుల్లో ఉండబోతున్నాడట పీటర్.

ఇక ఈ సినిమా కి సంబంధించిన పూర్తి వివరాలను నిర్మాత త్వరలో ఒక అధికారిక ప్రకటన చేయనున్నాడు.