Telugu Global
National

చెన్నై స్థానిక సలహా మండలి ఎల్ఏసీ హోదా వల్లే శేఖర్ రెడ్డికి టీటీడీలో చోటు

ఇప్పటికే 24 మందితో టీటీడీ బోర్డును ప్రకటించిన ప్రభుత్వం… మరో ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు దేశంలో వివిధ ప్రధాన నగరాల స్థానిక సలహా మండలి (ఎల్‌ఏసీ) అధ్యక్షులుగా ఉన్న వారికి చోటు కల్పించారు. ఢిల్లీ ఎల్‌ఏసీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు రాకేశ్‌ సిన్హా, బెంగళూరు ఎల్‌ఏసీగా ఉన్న కుపేందర్‌ రెడ్డి, హైదరాబాద్‌ ఎల్‌ఏసీ గోవింద హరి, భువనేశ్వర్ ఎల్‌ఏసీ కుమార్‌ దాస్‌, ముంబయి ఎల్‌ఏసీ అమోల్ కాలేను […]

చెన్నై స్థానిక సలహా మండలి ఎల్ఏసీ హోదా వల్లే శేఖర్ రెడ్డికి టీటీడీలో చోటు
X

ఇప్పటికే 24 మందితో టీటీడీ బోర్డును ప్రకటించిన ప్రభుత్వం… మరో ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు దేశంలో వివిధ ప్రధాన నగరాల స్థానిక సలహా మండలి (ఎల్‌ఏసీ) అధ్యక్షులుగా ఉన్న వారికి చోటు కల్పించారు.

ఢిల్లీ ఎల్‌ఏసీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు రాకేశ్‌ సిన్హా, బెంగళూరు ఎల్‌ఏసీగా ఉన్న కుపేందర్‌ రెడ్డి, హైదరాబాద్‌ ఎల్‌ఏసీ గోవింద హరి, భువనేశ్వర్ ఎల్‌ఏసీ కుమార్‌ దాస్‌, ముంబయి ఎల్‌ఏసీ అమోల్ కాలేను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. చెన్నైకి చెందిన శేఖర్‌ రెడ్డికి కూడా ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం కల్పించారు.

ప్రధాన నగరాల ఎల్‌ఏసీలను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడంతో ఆ కారణంగానే చెన్నై ఎల్‌ఏసీ అధ్యక్షుడుగా ఉన్న శేఖర్ రెడ్డికి చోటు దక్కేసింది.

చంద్రబాబు హయాంలో శేఖర్ రెడ్డి టీటీడీ సభ్యుడిగా ఉండేవారు. పెద్దనోట్ల రద్దు సమయంలో ఆయన ఇంట్లో భారీగా నగదు దొరకడంతో సీబీఐ కేసు నమోదు అయింది. ఆ తర్వాత ఆ కేసులో ఆయనకు క్లీన్ చిట్ లభించింది. ప్రస్తుతం చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడిగా ఉండడంతో…. టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుడి అవకాశం దక్కించుకున్నారు.

First Published:  19 Sep 2019 7:29 PM GMT
Next Story