Telugu Global
Cinema & Entertainment

రానాకి నో చెప్పిన మహానటి.... కారణం అదే !

మహానటి సినిమాలో నటనతో అందరినీ మెప్పించిన కీర్తి సురేష్ ….. ఆ సినిమా విజయంతో స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరిపోయింది. అయితే తెలుగు, తమిళ, మలయాళం,హిందీ పరిశ్రమల్లో ఇప్పుడు కీర్తి స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తుంది. అన్ని పరిశ్రమల్లో తనకి అవకాశాలు కూడా రెడీ గా ఉన్నాయి. అయితే బిజీ గా మారడం తో అన్ని సినిమాలు చేయలేకపోతోంది. అందుకే కొన్నిటిని సున్నితంగా తిరస్కరించాల్సి వస్తోంది. ఆ కోవలోనే ఇటీవల ఒక కొరియన్ […]

రానాకి నో చెప్పిన మహానటి.... కారణం అదే !
X

మహానటి సినిమాలో నటనతో అందరినీ మెప్పించిన కీర్తి సురేష్ ….. ఆ సినిమా విజయంతో స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరిపోయింది.

అయితే తెలుగు, తమిళ, మలయాళం,హిందీ పరిశ్రమల్లో ఇప్పుడు కీర్తి స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తుంది. అన్ని పరిశ్రమల్లో తనకి అవకాశాలు కూడా రెడీ గా ఉన్నాయి. అయితే బిజీ గా మారడం తో అన్ని సినిమాలు చేయలేకపోతోంది. అందుకే కొన్నిటిని సున్నితంగా తిరస్కరించాల్సి వస్తోంది.

ఆ కోవలోనే ఇటీవల ఒక కొరియన్ సినిమా రీమేక్ కి సంబందించిన ఆఫర్ ని తిరస్కరించింది కీర్తి. డ్రగ్స్ మాఫియా నేపథ్యం లో ఉండే ఈ సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ గా సాగుతుందట. ఆ కథ కి కీర్తి హీరోయిన్ అయితే బాగుంటుంది అని ప్రాజెక్ట్ నిర్మించాలని భావించిన రానా దగ్గుబాటి…. కీర్తి ని అప్రోచ్ కాగా ఆమె డేట్స్ లేవని సున్నితంగా తిరస్కరించిందట.

అయితే రానా ఇప్పుడు మరో హీరోయిన్ ని వెతికే పని లో ఉన్నాడట. ఆ కొరియన్ సినిమా ఏంటో తెలియదు కానీ ఆ సినిమా కి సంబందించిన రైట్స్ మాత్రం రానా కొనుగోలు చేసారని సమాచారం.

ప్రస్తుతం కీర్తి తెలుగు లో ‘మిస్ ఇండియా’ తో పాటు హిందీ లో ‘మైదాన్’ అనే సినిమా చేస్తుంది.

First Published:  19 Sep 2019 11:04 PM GMT
Next Story