Telugu Global
NEWS

కోడెలను శారీరకంగానూ హింసించారా?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై మాగ్జిమమ్ మైలేజ్ పొందేందుకు చంద్రబాబు శక్తివంచన లేకుండా కృషి చేశారనే చెప్పాలి. 10 రోజుల క్రితం కోడెల ఆస్పత్రిలో చేరినప్పుడు పరామర్శకు వెళ్లని చంద్రబాబు… కోడెల చనిపోయారనగానే శవంతో పంచాయతీ మొదలుపెట్టారు. ఆ తర్వాత అంత్యక్రియల వరకు శవం వెన్నంటే ఉన్నారు. ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేసేందుకు ముందుకొచ్చినా వాటిని అడ్డుకున్నారు చంద్రబాబు. కోడెలకు గౌరవప్రదమైన వీడ్కోలు కూడా దక్కకుండా చేశారు. తాజాగా గవర్నన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు […]

కోడెలను శారీరకంగానూ హింసించారా?
X

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై మాగ్జిమమ్ మైలేజ్ పొందేందుకు చంద్రబాబు శక్తివంచన లేకుండా కృషి చేశారనే చెప్పాలి. 10 రోజుల క్రితం కోడెల ఆస్పత్రిలో చేరినప్పుడు పరామర్శకు వెళ్లని చంద్రబాబు… కోడెల చనిపోయారనగానే శవంతో పంచాయతీ మొదలుపెట్టారు. ఆ తర్వాత అంత్యక్రియల వరకు శవం వెన్నంటే ఉన్నారు.

ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేసేందుకు ముందుకొచ్చినా వాటిని అడ్డుకున్నారు చంద్రబాబు. కోడెలకు గౌరవప్రదమైన వీడ్కోలు కూడా దక్కకుండా చేశారు. తాజాగా గవర్నన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు చంద్రబాబు. మొన్నటి వరకు గవర్నర్ల వ్యవస్తే వద్దన్న బాబు ఆయన్ను కలిసి ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల చనిపోయారని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కోడెలను మానసికంగా, శారీరకంగా హింసించి చంపారని చంద్రబాబు ఆరోపించారు.

‘కే ట్యాక్స్’ బాధితులు కోడెల కుటుంబంపై ఫిర్యాదులు చేసి ఉండవచ్చు. దాని వల్ల ఆయన మానసికంగా ఇబ్బందిపడి ఉండవచ్చు. మరీ చంద్రబాబు చెబుతున్నట్టు కోడెలను శారీరకంగా హింసించిన వారెవరు?. ప్రభుత్వం వైపు నుంచి అయితే కోడెల కుటుంబంపై కేసులు నమోదు అయినా ఒక్క రోజు కూడా పోలీసులు వారి ఇంటికి వెళ్లలేదు, కనీసం వారిని స్టేషన్‌కు పిలవలేదు. మరి అలాంటప్పుడు కోడెలను శారీరకంగా హింసించింది ఎవరు అన్నది చంద్రబాబే చెప్పాలి.

కోడెల మేనల్లుడు చెప్పినట్టు ఆస్తులు తన పేరున రాయాలంటూ కోడెల శివప్రసాదరావును ఆయన కుమారుడు హింసించే భాగంలోనే శారీరకంగా ఇబ్బంది పెట్టారన్నదే నిజం అనుకోవాలా?.

First Published:  20 Sep 2019 4:36 AM GMT
Next Story