Telugu Global
National

పోలవరాన్ని ముంచిన టీడీపీ అవినీతి

ఇప్పటిదాకా పోలవరం ప్రాజెక్ట్‌ నత్తనడకన సాగడానికి ప్రధాన కారణం గత తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యనేతలు సొమ్ము చేసుకోవడమే. అధికారంలో ఉన్న ఐదేళ్లు ఈ ప్రాజెక్ట్‌ను అడ్డం పెట్టుకుని తమ ఆస్తులు కూడబెట్టుకోవడానికి నాటి అధికార నాయకులు ప్రాధాన్యత ఇచ్చారే గానీ పనులు వేగవంతం చేసి రాష్ట్రానికి త్వరితగతిన ప్రయోజనం అందించేందుకు ఏమాత్రం చిత్తశుద్ధి చూపించలేదని స్పష్టమవుతోంది. గత చంద్రబాబు పాలనలో ఈ ప్రాజెక్ట్‌ పనుల్లో 2,400 కోట్ల అక్రమ చెల్లింపులు, అవకతవకలు జరిగాయని కొత్త ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి […]

పోలవరాన్ని ముంచిన టీడీపీ అవినీతి
X

ఇప్పటిదాకా పోలవరం ప్రాజెక్ట్‌ నత్తనడకన సాగడానికి ప్రధాన కారణం గత తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యనేతలు సొమ్ము చేసుకోవడమే. అధికారంలో ఉన్న ఐదేళ్లు ఈ ప్రాజెక్ట్‌ను అడ్డం పెట్టుకుని తమ ఆస్తులు కూడబెట్టుకోవడానికి నాటి అధికార నాయకులు ప్రాధాన్యత ఇచ్చారే గానీ పనులు వేగవంతం చేసి రాష్ట్రానికి త్వరితగతిన ప్రయోజనం అందించేందుకు ఏమాత్రం చిత్తశుద్ధి చూపించలేదని స్పష్టమవుతోంది.

గత చంద్రబాబు పాలనలో ఈ ప్రాజెక్ట్‌ పనుల్లో 2,400 కోట్ల అక్రమ చెల్లింపులు, అవకతవకలు జరిగాయని కొత్త ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ తేల్చింది. మొత్తం చెల్లింపుల్లో అంత మొత్తం అక్రమాలు జరిగాయంటే అందులో ఎంత మొత్తం నాటి ప్రభుత్వంలోని పెద్దలకు, ముఖ్యులకు చేరిందనేది తదుపరి దర్యాప్తులోగానీ బయటపడే అవకాశం లేదు. ఈ ప్రాజెక్ట్‌ను తమ స్వార్థ ప్రయోజనాలకోసమే ఉపయోగించుకున్నారని నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను పరిశీలిస్తే సామాన్యులకు సైతం అర్థం అవుతోంది.

ముడుపుల కోసమే కేంద్రం నుంచి రాష్ట్రానికి పని…

అసలు ఈ ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాలి. దేశంలో ఇంతవరకు జాతీయ ప్రాజెక్టులన్నీ కేంద్రమే త్వరితగతిన పూర్తి చేసింది. కానీ నాటి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో బీజెపికి మిత్రపక్షంగా ఉండేది. ఫలితంగా చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి చేసి ఈ ప్రాజెక్ట్‌ అమలును రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు.

కేంద్రం నిధులు ఇవ్వడం ద్వారా…. రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయించే విధంగా…. అంగీకారం కుదరింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం సులభంగా భారాన్ని తగ్గించుకుంది. ఇందుకోసం నిర్మాణ పనులకు మాత్రమే నిధులు చెల్లిస్తామని మిగిలిన భూసేకరణ, పునరావాసం తదితర పనులు తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది.

ఇందుకు చంద్రబాబు అప్పట్లో ఒప్పుకోవడం వెనుక పనుల ద్వారా తాను, తమ వారు లబ్ధిపొందాలని ప్రాజెక్ట్‌ ప్రయోజనాలను తాకట్టుపెట్టారు. పనులను పూర్తిగా కేంద్రం ప్రభుత్వమే అమలు చేయించి ఉంటే సహజంగానే భూసేకరణ, పునరావాసం బాధ్యత కూడ కేంద్రం పైనే ఉండేది.

ఈ విధంగా నష్టం జరగడం వెనుక నాటి ప్రభుత్వ పెద్దల అవినీతే కారణం. పనులను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకువస్తే తద్వారా తమవారు సబ్‌కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తి లాభపడతారని, ప్రత్యక్షంగా బిల్లుల చెల్లింపులలో తమ చేతివాటం ప్రదర్శించవచ్చనే ఉద్దేశ్యంతో మొత్తం ప్రాజెక్ట్‌నే ముంచేశారు. ఈ విధంగా నేటి సంక్షోభానికి పూర్తిగా నాటి పాలకులే కారణం.

ఆరోపించిన ప్రధాని దర్యాప్తు జరిపించకపోవడం వెనుక…

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు నత్తనడకన జరగడమే కాకుండా అక్రమాలు, అవకతవకలు జరిగాయనే ఆరోపణలు రావడంతోనే కొత్త ప్రభుత్వం ఉన్నతస్థాయి నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించింది. ఎన్నికల సమయంలో ఈ ప్రాజెక్ట్‌ను తెలుగుదేశం ప్రభుత్వం, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏటీఎంగా మారిందని, ఈ ప్రాజెక్ట్‌ను అడ్డం పెట్టుకుని సంపాదనకే ప్రాధాన్యత ఇచ్చారని ప్రధాని నరేంద్రమోడి ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించగా…. ఆ కమిటీ ప్రధాని చేసిన ఆరోపణలను నిరూపించేవిధంగా నివేదిక సమర్పించింది. నివేదికలోని అంశాలు పరిశీలిస్తే నాటి ప్రభుత్వం నిజంగానే ఈ ప్రాజెక్ట్‌ను ఏటీఎంగా వాడుకుందనే అభిప్రాయం కలగకమానదు.

ప్రాజెక్ట్‌ పనులు ఓ వైపు నత్తనడకన నడుస్తూ…. రైతులకు ప్రయోజనాలు అందించడంలో ఆలస్యం అవ్వడమే కాకుండా అదే అదునుగా వ్యయాలను పెంచుకుంటూ, త్వరితగతిన పనులు పూర్తిచేసేందుకు అదనపు చెల్లింపులు అవసరం అంటూ ప్రభుత్వం అప్పట్లో ఇష్టానుసారం బిల్లులు చెల్లించింది.

అందుకు అడ్డం వచ్చిన నియమ నిబంధనలను క్యాబినెట్‌ తీర్మానాల పేరుతో తనకు అనుకూలంగా మార్చుకుంది. ప్రాజెక్ట్‌లో ప్రధానమైన పనులను నేరుగా నామినేషన్‌ పద్ధతిలో అప్పగించింది. వేల కోట్ల రూపాయలు ఈ విధంగా నామినేషన్‌ పద్ధతిలో అప్పగించినా ఎవ్వరూ నోరుమెదపలేదు. తమ వారికి ప్రయోజనం చేకూరుతోందని ఎల్లో మీడియా పరోక్షంగా, ప్రత్యక్షంగా మద్దతు పలికింది.

దేశంలో ఎక్కడాలేని విధంగా వేలకోట్ల రూపాయల పనులను ప్రధాన కాంట్రాక్టర్‌ నుంచి తప్పించి తమకు కావాల్సిన కాంట్రాక్టర్‌కు అప్పగించడం నాటి తెలుగుదేశం ప్రభుత్వానికి సాధ్యమయ్యింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరించింది.

పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా వాడుకుంటున్నారని…. ఎన్నికల సమయంలో ఆరోపించిన ప్రధాని, ఆయన నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే అందుకు సహకరించిందనే విషయాన్ని విస్మరించారు. అప్పుడైనా, ఇప్పుడైనా నాటి ప్రభుత్వం అక్రమాలపై విచారణ జరిపించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది.

ప్రత్యేకంగా ఈ ప్రాజెక్ట్‌ను కేంద్రం జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించి కేంద్రం నిధులు విడుదల చేస్తున్నందున పనుల్లో అక్రమాలు, చెల్లింపుల్లో అవకతవకలపై విచారణ జరిపించే పూర్తి అధికారం కేంద్రానికి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు అటువంటి ప్రయత్నమే చేయలేదు.

రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదికలో కళ్లు బైర్లుగమ్మే అక్రమాలు వెలుగు చూసినా కేంద్రం మాత్రం పరోక్షంగా నాటి తెలుగుదేశం ప్రభుత్వానికే మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన ముఖ్యనాయకులు బీజెపిలో చేరిపోయారు. ముఖ్యంగా రాజ్యసభ ఎంపీలు. తద్వారా ఎగువ సభలో బీజేపీ బలం పెరిగింది.

కేంద్రం నుంచి ఎటువంటి సమస్యలు, ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు తనవైపు చూడకుండా ఉండేందుకే ఎంపీలను చంద్రబాబు తెలివిగా బీజేపీలో చేర్చారని ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగిన విధంగానే కేంద్రం కూడా పోలవరం అక్రమ చెల్లింపులపై నోరు మెదపడం లేదు.

పైగా రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా పనులు వేగవంతం చేసి ప్రభుత్వంపై భారం తగ్గించడం ద్వారా ప్రజల సొమ్మును ఆదా చేసేందుకు కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కేంద్రం నుంచి సహకారం లభించడం లేదు.

టీడీపీ నేతలే బీనామీ కాంట్రాక్టర్లు…

పోలవరం ప్రాజెక్ట్‌లో పాత ఎస్‌ఎస్‌ఆర్‌ ప్రకారమే బిల్లులు చెల్లించాలి. కానీ 2015-16 ఎస్‌ఎస్‌ఆర్‌ను పరిగణనలోకి తీసుకోవడం వల్ల ప్రభుత్వంపై రూ. 1331 కోట్ల భారం పడింది. అదే విధంగా ప్రధాన కాంట్రాక్టర్‌ నుంచి రాబట్టాల్సిన మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లపై వడ్డీ 84.43 కోట్లు ఇంతవరకు వసూలు చేయలేదు.

చిల్లర ఖర్చు కింద కాంట్రాక్టర్‌కు ఏకంగా 142 కోట్లు చెల్లించారంటే విస్తు కలుగుతోంది. ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని పనుల్లోనూ మొత్తంగా 2400 కోట్లు అదనంగా చెల్లించారు. వీటన్నింటికీ గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి. ఈ ప్రాజెక్టు పనులను చంద్రబాబు ముఖ్య బినామీగా పేరుపడ్డ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు సన్నిహిత కంపెనీగా పేరుపడ్డ త్రివేణీ సంస్థకు సబ్‌ కాంట్రాక్ట్‌ ద్వారా కట్టబెట్టారు.

ఈ కంపెనీ చంద్రబాబు బినామీ అని రాజకీయ, ఇన్‌ఫ్రా కంపెనీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు వందల కోట్ల విలువైన పనులను కట్టబెట్టారు. ఆర్ధిక మంత్రి యనమల మాత్రం తన వియ్యంకుడి కంపెనీ బిల్లులు వస్తే మాత్రం ఆఘమేఘాలపై క్లియర్‌ చేసే వారు.

పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు పోలవరం ఎడమ కాలువ అయిదో ప్యాకేజ్‌లో రూ. 142 కోట్ల విలువైన పనులు, 179 కోట్ల ఆరో ప్యాకేజీ పనులను టీడీపీ నేత ఋలుసు సుధాకర రావుకు అప్పగించారు.

ఇక చంద్రబాబు బినామీ ఎంపీ సీఎం రమేష్‌ (ప్రస్తుతం ఈయన బీజెపిలో ఉన్నారు) ప్రవేశపెట్టిన త్రివేణీ సంస్థకు అత్యధికంగా రూ. 1708 కోట్ల విలువైన హెడ్‌ వర్క్స్‌ మట్టి పనిని కట్టబెట్టారు.

పోలవరం కుడి కాలువ ఆరు, ఏడు ప్యాకేజీ పనులను టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యకు చెందిన బీఎస్‌పీసీఎల్‌ కంపెనీకి అప్పగించారు. ఈ పనులు విలువ 286 కోట్లు. సూర్య కన్‌స్ట్రక్షన్స్‌ శ్రీనివాసరావుకు రూ. 103 కోట్ల పనులు అప్పగించారు. అధికారికంగా కాగితాలపై ఉన్న కంపెనీలు ఇవైతే అనధికారికంగా ఇంకా ఎన్ని ఉన్నాయో చెప్పలేని పరిస్థితి.

పోలవరం ప్రాజెక్టులో ఆది నుంచి అవకతవకలు జరుగుతున్నాయని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ చెల్లింపులు ఇస్టానుసారం చేస్తున్నారని, మట్టి పనిని ఎం బుక్‌లో రికార్డ్‌ చేయలేదని కమిటీ తన నివేదికలో పేర్కొంది.

నాణ్యత పరీక్షించకుండానే బిల్లులు చెల్లింపుల వెనుక మర్మం…

ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ మొదలైన వాటి నాణ్యత పరీక్షించేందుకు కూడా ప్రభుత్వం చెల్లింపులు చేసింది. అయితే నిబంధనల ప్రకారం అక్కడ నాణ్యత పరీక్షలకు లేబరేటరీ ఏర్పాటు చేయాల్సి ఉన్నా అలా చేసినట్లు ఆధారాలు ఎక్కడా లేవు. లేబరేటరీ ఉన్నట్లు సంస్థ మాత్రం తెలిపింది.

సిమెంట్‌, ఇతర మెటీరియల్‌ కాంట్రాక్టు సంస్థ కొనుగోలు చేసి బిల్లులు శాఖా పరంగా చెల్లించారు. ఈ చెల్లింపులు కాంట్రాక్టర్‌ నుంచి తరువాత రాబట్టినా ఇది ప్రభుత్వ విధానం, ఒప్పంద నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకం. ఈ ప్రాజెక్ట్‌లో గత ప్రభుత్వం అవినీతి ఎంతలా చేసిందంటే ఎస్‌ఈని కాంట్రాక్టర్‌ ఏర్పాటు చేసిన కిచెన్‌ ఇన్‌ఛార్జిగా చూపారు. ఇదో వింత. ఆ రోజున 44,23,981 అడ్వాన్స్‌గా చెల్లించారు. ఇదో ఉదాహరణ. వీక్లీ రేషన్‌కు భారీ మొత్తంలో అడ్వాన్స్‌లు చెల్లించారు.

2017 సెప్టెంబర్‌ 25న 44,23,981 అడ్వాన్స్‌గా చెల్లించారు. మెటీరియల్‌కు అడ్వాన్స్‌ చెల్లించారు. డీజిల్‌ కొనుగోలు చేసేందుకు కొత్త కాంట్రాక్టర్‌కు రివాల్వింగ్‌ ఫండ్‌ కింద ప్రత్యేకంగా చెల్లించారు. ప్రధాన కాంట్రాక్టర్‌ ట్రాన్స్‌స్ట్రాయ్‌ నుంచి ఇంప్రెస్ట్‌ అకౌంట్‌ ద్వారా రూ. 144.22 కోట్ల బకాయిలు ఉన్నారు. ఆ మొత్తాన్ని రికవరీ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఈ మొత్తాన్ని రికవరీ చేసేందుకు న్యాయపరంగా జలవనరుల శాఖ చర్యలు తీసుకోవాలి. ఆర్‌ఆర్‌ చట్టం ద్వారా రికవరీ చేసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు చేసిన పోలవరం దందాలో నిబంధనలు ఉల్లంఘన, దోపిడీకి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

First Published:  20 Sep 2019 12:36 AM GMT
Next Story