వెంకీ మామ… ఈ క్లైమాక్స్ నిజమేనా?

వెంకటేష్, నాగ చైతన్య, రాశి ఖన్నా, పాయల్ రాజపుట్ కలిసి నటిస్తున్న చిత్రం వెంకీ మామ. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాబీ ఈ సినిమాకి దర్శకుడు.

ఈ సినిమా లో ఆసక్తికరమైన క్లైమాక్స్ ని చిత్ర యూనిట్ షూట్ చేయనున్నారట. అయితే వెంకటేష్ ఈ సినిమా లో మిలిటరీ లో పని చేసే అధికారిగా కనిపిస్తాడట… అతని మేనల్లుడిగా నాగ చైతన్య నటిస్తున్నాడు. సరదాగా కామెడీ తో మొదలయ్యే ఈ సినిమా రెండో భాగానికి వచ్చే సరికి పూర్తిగా ఎమోషనల్ గా మారుతుందట.

ఈ సినిమా లో క్లైమాక్స్ లో వెంకటేష్ చనిపోతాడట. అయితే పూర్తి స్థాయి ఎమోషనల్ గా ఈ ఎపిసోడ్ ని డిజైన్ చేశారట దర్శక నిర్మాతలు.

సాధారణం గా ట్రాజడీ క్లైమాక్స్ ని తెలుగు ప్రేక్షకులు, మరీ ముఖ్యం గా వెంకటేష్ అభిమానులు ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారు అనే విషయం మీద ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు. అందుకే కొంత మందికి సినిమా చూపించి, వారి స్పందనని బట్టి కుదిరితే ఇంకొక క్లైమాక్స్ కూడా షూట్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారట.

ఇక ఈ సినిమాని  దీపావళి కి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్.