Telugu Global
National

వాళ్ళకు వేళ్ళు ఎక్కువ.... అందుకే ఉద్యోగాలు రావడం లేదు

మధ్యప్రదేశ్ లోని ఓ కుటుంబం… మనుషులకు సాధారణం గా ఉండే కాలు, చేతి వేళ్ల సంఖ్య కంటే ఎక్కువ వేళ్ళు ఉండటంవల్ల మానసికంగానూ, ఆర్థికంగానూ కుంగిపోతున్నారు. వీరి వేళ్ల పుణ్యమా అని వారి గ్రామం ప్రసిద్ధి చెందున్నది కానీ వారు మాత్రం కాలక్రమంలో చితికి పోతున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేతుల్ గ్రామంలో ఈ కుటుంబం నివసిస్తూ ఉన్నది. ఇలా చేతులకు పది, కాళ్లకు పది ఉండాల్సిన వేళ్ళు అంతకన్నా […]

వాళ్ళకు వేళ్ళు ఎక్కువ.... అందుకే ఉద్యోగాలు రావడం లేదు
X

మధ్యప్రదేశ్ లోని ఓ కుటుంబం… మనుషులకు సాధారణం గా ఉండే కాలు, చేతి వేళ్ల సంఖ్య కంటే ఎక్కువ వేళ్ళు ఉండటంవల్ల మానసికంగానూ, ఆర్థికంగానూ కుంగిపోతున్నారు. వీరి వేళ్ల పుణ్యమా అని వారి గ్రామం ప్రసిద్ధి చెందున్నది కానీ వారు మాత్రం కాలక్రమంలో చితికి పోతున్నారు.

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేతుల్ గ్రామంలో ఈ కుటుంబం నివసిస్తూ ఉన్నది. ఇలా చేతులకు పది, కాళ్లకు పది ఉండాల్సిన వేళ్ళు అంతకన్నా ఎక్కువగా ఉండటానికి కారణం జన్యువుల లో ఉన్న అసాధారణత్వం అని డాక్టర్లు చెబుతున్నారు. ఈ కండిషన్ ని’పోలి డాక్టిలీ’ అని వైద్య పరిభాషలో అంటారు.

కుటుంబ సభ్యుడు బల్దేవ్ యావ్లే మాట్లాడుతూ… తమ కుటుంబ సభ్యులు 25 మంది ఉంటే అందరికీ పోలిడాక్టిలీ ఉందని చెప్పాడు. తన కుటుంబ ప్రత్యేకత తెలుసుకున్న చుట్టుపక్కల జిల్లాల వారు కూడా తమను కలవడానికి వస్తూ ఉంటారని అతడు అన్నాడు.

పిల్లలు చదువుకోవటం, ఉద్యోగాన్ని సంపాదించడం ఈ స్థితిలో చాలా కష్టంగా ఉందని యావ్లే అంటున్నాడు. “నా పిల్లలు స్కూల్ కి వెళ్లారు. కానీ చదువు పూర్తి చేయలేకపోయారు. ఇతర పిల్లలు మా వాళ్లను ఏడిపిస్తూ ఉంటారు. మాకు ప్రభుత్వ సహాయం కావాలి. మాకు పొలం లేదు. పేదవాళ్లం” అంటూ తమ గోడు వెళ్లబోసుకున్నాడు.

యావ్లే కొడుకు సంతోష్ మాట్లాడుతూ తన వేళ్ళు కారణంగా చదువు పూర్తి చేయలేక పోయానని ఉద్యోగం కూడా పొందలేకపోతున్నానని చెప్పాడు. సాధారణంగా అందరూ వేసుకునే చెప్పులు, బూట్లు తమకు పట్టవని అన్నాడు. “10వ తరగతి వరకు చదివాను. ఆర్మీ సెలక్షన్స్ కి వెళితే అక్కడ ఫిజికల్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాను” అని తన వేళ్ల వలన కోల్పోయిన జీవితం గురించి బాధతో చెప్పుకున్నాడు. తనకు 12 చేతివేళ్లు, 14 కాళ్ల వేళ్ళు ఉన్నాయని అందువల్లనే తనకు ఉద్యోగం రాలేదని అతడు వాపోతున్నాడు, ఈ స్థితిలో తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆ కుటుంబం వేడుకుంటున్నది.

First Published:  21 Sep 2019 12:24 AM GMT
Next Story