Telugu Global
NEWS

బాబు, పచ్చ మీడియా దరిద్ర ప్రచారం

లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూస్తున్న చంద్రబాబు నాయుడు, ఆయన పచ్చ మీడియాకు నిద్ర పట్టడం లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విరుచుకుపడ్డారు. “చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే లక్షా ఇరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇది చూసి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు, పచ్చ మీడియా సచివాలయ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయంటూ దరిద్ర […]

బాబు, పచ్చ మీడియా దరిద్ర ప్రచారం
X

లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూస్తున్న చంద్రబాబు నాయుడు, ఆయన పచ్చ మీడియాకు నిద్ర పట్టడం లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విరుచుకుపడ్డారు.

“చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే లక్షా ఇరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇది చూసి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు, పచ్చ మీడియా సచివాలయ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయంటూ దరిద్ర ప్రచారం చేస్తున్నారు” అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇలాంటి ప్రకటనలు చేసి యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న చంద్రబాబు నాయుడు, ఆయన పచ్చ మీడియాకు సిగ్గుందా అని ప్రశ్నించారు. ఏ రాజకీయ నాయకుడు కానీ, మంత్రులు కానీ, శాసన సభ్యులు కానీ సిఫార్సు చేయకుండా అభ్యర్థుల ప్రతిభే ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ కల్పన చేస్తోందని, ఇది చేయడం రాని చంద్రబాబు నాయుడు తన పచ్చ మీడియా ద్వారా వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ విరుచుకుపడ్డారు.

“సచివాలయ ఉద్యోగాల్లో కానీ, వాలంటీర్ల ఉద్యోగాల కల్పనలో కానీ చిన్న అవినీతి జరిగిందని నిరూపించగలరా?” అని మంత్రి సవాల్ చేశారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబు నాయుడు మాత్రం తన బుద్ధిని మార్చుకోవడం లేదని, ఆయన ఇలాగే ఉంటే ప్రజలు మరింత గుణపాఠం నేర్పుతారని మంత్రి అన్నారు.

“ఇప్పటికైనా మీరు మారండయ్యా. మీరు చేస్తున్న పనులకు సిగ్గు తెచ్చుకోండి. ప్రజలు అసహ్యించుకునే స్థాయికి దిగజార కండి” అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హితవు పలికారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి సహా పలు ప్రాంతాల్లో సచివాలయ పశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ వచ్చిన ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులకు యువత నిప్పుపెట్టారు. తప్పుడు ప్రచారం చేస్తే ఉరుకునేది లేదంటూ నినాదాలు చేశారు.

First Published:  20 Sep 2019 8:48 PM GMT
Next Story