Telugu Global
Cinema & Entertainment

అక్టోబర్ 5న చాణక్య....

గత కొంతకాలంగా గోపీచంద్ కెరీర్ లో ఒక హిట్ సినిమా కూడా లేదు. ఈ మధ్యనే గోపీచంద్ మరియు మెహ్రీన్ పిర్జాదా హీరోహీరోయిన్లుగా నటించిన ‘పంతం’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే తాజాగా గోపీచంద్ ‘చాణక్య’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో కూడా మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 5న విడుదల కాబోతోందని అధికారికంగా ప్రకటించారు దర్శకనిర్మాతలు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా […]

అక్టోబర్ 5న చాణక్య....
X

గత కొంతకాలంగా గోపీచంద్ కెరీర్ లో ఒక హిట్ సినిమా కూడా లేదు. ఈ మధ్యనే గోపీచంద్ మరియు మెహ్రీన్ పిర్జాదా హీరోహీరోయిన్లుగా నటించిన ‘పంతం’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే తాజాగా గోపీచంద్ ‘చాణక్య’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమాలో కూడా మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 5న విడుదల కాబోతోందని అధికారికంగా ప్రకటించారు దర్శకనిర్మాతలు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ కూడా అక్టోబర్ 2 న విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే.

ఒకవైపు మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ‘సైరా నరసింహారెడ్డి’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా అమితాబచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి వంటి స్టార్ నటీ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

మరోవైపు ‘చాణక్య’ సినిమా గోపీచంద్ కి చాలా కీలకం కాబోతోంది. గోపీచంద్ కెరీర్ కి ఈ హిట్ ఎంతో అవసరం.

మరి ఇలాంటి పరిస్థితుల్లో ‘సైరా’ విడుదలైన మూడు రోజుల్లోనే ‘చాణక్య’ సినిమా విడుదలై హిట్ అందుకుంటుందా? అని ట్రేడ్ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి.

First Published:  21 Sep 2019 2:46 AM GMT
Next Story