Telugu Global
NEWS

టోక్యో ఒలింపిక్స్ కు దీపక్ పూనియా అర్హత

నలుగురు భారత వస్తాదులకు 2020 ఒలింపిక్స్ టికెట్లు ప్రపంచ కుస్తీ సెమీస్ చేరిన దీపక్ పూనియా 2019 ప్రపంచ కుస్తీ పోటీలలో భారత వస్తాదులు తమ సత్తా చాటుకొన్నారు. ఒకరు కాదు…ఇద్దరు కాదు..ఏకంగా నలుగురు మల్లయోధులు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించి వారేవ్వా అనిపించుకొన్నారు. కజకిస్తాన్ లోని నూర్ సుల్తాన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కుస్తీ కమ్ ఒలింపిక్స్ అర్హత పోటీల పురుషుల, మహిళల విభాగాలలో భజరంగ్ పూనియా, రవి కుమార్ దహియా, మహిళల […]

టోక్యో ఒలింపిక్స్ కు దీపక్ పూనియా అర్హత
X
  • నలుగురు భారత వస్తాదులకు 2020 ఒలింపిక్స్ టికెట్లు
  • ప్రపంచ కుస్తీ సెమీస్ చేరిన దీపక్ పూనియా

2019 ప్రపంచ కుస్తీ పోటీలలో భారత వస్తాదులు తమ సత్తా చాటుకొన్నారు. ఒకరు కాదు…ఇద్దరు కాదు..ఏకంగా నలుగురు మల్లయోధులు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించి వారేవ్వా అనిపించుకొన్నారు.

కజకిస్తాన్ లోని నూర్ సుల్తాన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కుస్తీ కమ్ ఒలింపిక్స్ అర్హత పోటీల పురుషుల, మహిళల విభాగాలలో భజరంగ్ పూనియా, రవి కుమార్ దహియా, మహిళల విభాగంలో వినేశ్ పోగట్ ఇప్పటికే కాంస్య పతకాలతో ఒలింపిక్స్ కు అర్హత సంపాదించారు.

ప్రపంచ జూనియర్ చాంపియన్ దీపక్ పూనియా సైతం టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించడం ద్వారా…భారత మల్లయోధుల సంఖ్యను నాలుగుకు పెంచాడు.

తన కెరియర్ లో తొలిసారిగా ప్రపంచ సీనియర్ కుస్తీ పోటీలలో పాల్గొన్న దీపక్ పూనియా పురుషుల 86 కిలోల విభాగంలో కొలంబియాకు చెందిన కార్లోస్ ఆర్థర్ మెండేజ్ పై 7-6 విజయంతో సెమీస్ కు చేరడంతోనే …టోక్యో ఒలింపిక్స్ టికెట్ ఖాయమైపోయింది.

ఫైనల్లో చోటు కోసం జరిగే సమరంలో స్విట్జర్లాండ్ వస్తాదు స్టెఫాన్ రీచ్ ముత్ తో తలపడతాడు.

First Published:  21 Sep 2019 6:40 AM GMT
Next Story