Telugu Global
Cinema & Entertainment

మొదటి వారం గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్!

నాని మరియు,  ప్రియాంక అరుళ్ మోహన్ కలిసి నటించిన సినిమా గ్యాంగ్ లీడర్. విక్రమ్ కుమార్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. అయితే ఈ సినిమా సాహో విడుదల అయిన తేదీన రావాల్సి ఉంది… కానీ కొన్ని అనుకోని కారణాల వలన సాహో కోసం ఈ సినిమా ని వాయిదా వేశారు నిర్మాతలు. దీంతో గ్యాంగ్ లీడర్ ప్రమోషన్స్ స్ట్రాటజీ మొత్తం మార్చారు. సినిమా కి పది రోజుల ముందు […]

మొదటి వారం గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్!
X

నాని మరియు, ప్రియాంక అరుళ్ మోహన్ కలిసి నటించిన సినిమా గ్యాంగ్ లీడర్. విక్రమ్ కుమార్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. అయితే ఈ సినిమా సాహో విడుదల అయిన తేదీన రావాల్సి ఉంది… కానీ కొన్ని అనుకోని కారణాల వలన సాహో కోసం ఈ సినిమా ని వాయిదా వేశారు నిర్మాతలు. దీంతో గ్యాంగ్ లీడర్ ప్రమోషన్స్ స్ట్రాటజీ మొత్తం మార్చారు.

సినిమా కి పది రోజుల ముందు నుంచి పూర్తి స్థాయి లో ప్రమోషన్స్ చేసి ఈ సినిమా అందరి దృష్టి ని ఆకర్షించేలా చేశారు దర్శక నిర్మాతలు. మొదటి వారం లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది…. కానీ సోమవారం నాడు ఈ సినిమా కలెక్షన్స్ పడిపోయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలా సోమవారం నాడు పడిపోయిన కలెక్షన్స్ మళ్ళీ పుంజుకోలేదు.

ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే, వారం రోజుల్లో మొత్తం గా 14.32 కోట్లని రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించింది. అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వారం రోజుల్లో 19.17 కోట్ల ని సంపాదించింది.

ఈ శుక్రవారం నాడు గద్దలకొండ గణేష్ సినిమా విడుదల కావడం తో గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్ తగ్గు ముఖం పెట్టె అవకాశం ఉంది.

First Published:  20 Sep 2019 9:14 PM GMT
Next Story