Telugu Global
NEWS

హుజూర్ నగర్ ఉపఎన్నిక: కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే...

మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలతోపాటు తెలంగాణలోని హుజూర్ నగర్ ఉప ఎన్నికకు కూడా కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యింది. సెప్టెంబర్ 27న నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్టు కేంద్రం ఎన్నికల కమిషనర్ తెలిపారు. పోలింగ్ ను అక్టోబర్ 21న, 24న కౌంటింగ్ నిర్వహించి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువరిస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఉప ఎన్నికకు ప్రకటన రావడంతో టీఆర్ఎస్ అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ […]

హుజూర్ నగర్ ఉపఎన్నిక: కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే...
X

మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలతోపాటు తెలంగాణలోని హుజూర్ నగర్ ఉప ఎన్నికకు కూడా కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యింది. సెప్టెంబర్ 27న నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్టు కేంద్రం ఎన్నికల కమిషనర్ తెలిపారు. పోలింగ్ ను అక్టోబర్ 21న, 24న కౌంటింగ్ నిర్వహించి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువరిస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది.

ఉప ఎన్నికకు ప్రకటన రావడంతో టీఆర్ఎస్ అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ చేతిలో ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థి సైదారెడ్డినే తిరిగి అభ్యర్థిగా పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ఖరారు చేశారని కేటీఆర్ తెలిపారు.

అసెంబ్లీ సమావేశాల్లోనే హుజూర్ నగర్ ఎన్నిక ప్రకటన రావడంతో నల్గొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలతో కేసీఆర్ చర్చించారు. తిరిగి సైదారెడ్డినే అభ్యర్థిగా నిర్ణయించారు.

ఇక తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ తిరిగి తనకు టికెట్ ఇవ్వాలని చేస్తున్న డిమాండ్ ను కేసీఆర్ తోసిపుచ్చినట్టు తెలిసింది. స్వల్ప తేడాతో ఓడిన సైదారెడ్డిని నిలబెడితేనే గెలుపు అవకాశాలుంటాయని కేసీఆర్ భావిస్తున్నారు.

ఇక ఇప్పటికే హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతిని పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిపై మరో నేత రేవంత్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. కానీ పద్మావతికే కాంగ్రెస్ సీనియర్లు సపోర్టు చేశారు.

కాగా బీజేపీ నుంచి అనూహ్యంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడి పేరు తెరపైకి వచ్చింది. తెలంగాణలో ప్రస్తుతం బలం పుంజుకునే పనిలో ఉన్న బీజేపీ ఇక్కడ బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న, ఆర్థికంగా మంచి స్థితిమంతుడు, జానారెడ్డి చరిష్మా కలిగి ఉన్న ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి బీజేపీ తరుఫున నిలబెట్టేందుకు యోచిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ ఓట్లను చీల్చి గెలవాలని ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెడ్లను దించగా.. బీజేపీ కూడా బలమైన నేపథ్యమున్న జానా కొడుకును దించేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసింది.

First Published:  21 Sep 2019 5:00 AM GMT
Next Story