Telugu Global
Cinema & Entertainment

10 న మహేష్ బాబు, 12 న అల్లు అర్జున్....

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలిసి ఈ సారి సంక్రాంతి కి థియేటర్ల దగ్గర సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలు తమ తమ సినిమాలకి సంబందించిన షూటింగ్స్ తో బిజీ గా ఉన్నారు. ఒకవైపు సరిలేరు నీకెవ్వరు, మరో వైపు అల వైకుంఠపురంలో సినిమాలకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నిన్న మొన్నటి దాకా ఈ సినిమాల కి సంబంధించి విడుదల తేదీ ల పై క్లారిటీ ఏమి […]

10 న మహేష్ బాబు, 12 న అల్లు అర్జున్....
X

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలిసి ఈ సారి సంక్రాంతి కి థియేటర్ల దగ్గర సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలు తమ తమ సినిమాలకి సంబందించిన షూటింగ్స్ తో బిజీ గా ఉన్నారు. ఒకవైపు సరిలేరు నీకెవ్వరు, మరో వైపు అల వైకుంఠపురంలో సినిమాలకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

నిన్న మొన్నటి దాకా ఈ సినిమాల కి సంబంధించి విడుదల తేదీ ల పై క్లారిటీ ఏమి రాలేదు…. కానీ ప్రస్తుతం ట్రేడ్ వర్గాల వద్ద నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ రెండు సినిమా లు రెండు రోజుల వ్యవధి లో విడుదల కానున్నాయి.

ముందుగా జనవరి 10 న మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం లో రానున్న ఈ సినిమా ని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తం గా నిర్మిస్తున్నారు.

ఇక రెండు రోజుల తరువాత అంటే 12 న అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం లో అనే సినిమా విడుదల కానుంది. త్రివిక్రమ్ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా ని అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తం గా నిర్మిస్తున్నారు.

ఈ రెండు సినిమాల్లో ఏది బాక్స్ ఆఫీస్ కాసుల వర్షం కురిపిస్తుందో చూడాలి.

First Published:  22 Sep 2019 9:37 PM GMT
Next Story