Telugu Global
International

అమెరికా సెనేటర్ భార్యకు మోడీ క్షమాపణలు

ఆదివారం హ్యూస్టన్‌లో జరిగిన “హౌడీ, మోడీ!” మెగా ఈవెంట్ కి హాజరయినందున తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ ని కోల్పోయిన యుఎస్ సెనేటర్ జాన్ కార్నిన్ భార్యకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పారు. ప్రధానమంత్రి కార్యాలయం పోస్ట్ చేసిన ఒక వీడియో ట్వీట్‌లో… పిఎం మోడీ సెనేటర్ భార్య శాండీని సుతారంగా “క్షమించండి” అని కోరారు. “నేను క్షమించండి అని అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు మీ పుట్టినరోజు. మీ ఉన్నతమైన జీవిత భాగస్వామి నాతో ఉన్నారు […]

అమెరికా సెనేటర్ భార్యకు మోడీ క్షమాపణలు
X

ఆదివారం హ్యూస్టన్‌లో జరిగిన “హౌడీ, మోడీ!” మెగా ఈవెంట్ కి హాజరయినందున తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ ని కోల్పోయిన యుఎస్ సెనేటర్ జాన్ కార్నిన్ భార్యకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పారు. ప్రధానమంత్రి కార్యాలయం పోస్ట్ చేసిన ఒక వీడియో ట్వీట్‌లో… పిఎం మోడీ సెనేటర్ భార్య శాండీని సుతారంగా “క్షమించండి” అని కోరారు.

“నేను క్షమించండి అని అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు మీ పుట్టినరోజు. మీ ఉన్నతమైన జీవిత భాగస్వామి నాతో ఉన్నారు కాబట్టి సహజంగానే మీరు ఈ రోజు అసూయపడి ఉండాలి” అని పిఎం మోడీ ట్వీట్ చేశారు.

“అయితే … మీకు శుభాకాంక్షలు, మీకు సంతోషకరమైన జీవితం, సంపన్నమైన, ప్రశాంతమైన భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్” అని ప్రధాని అన్నారు. రెండు గంటల్లో ఈ పోస్ట్ 6,500 లైక్‌లు, 1,000 కి పైగా రీట్వీట్లకు నోచుకుంది.

కార్నిన్స్ వివాహం జరిగి 40 ఏండ్లయింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

టెక్సాస్ చెందిన సెనేటర్ జాన్ కార్నిన్… “హౌడీ మోడీ!” కు హాజరైన రిపబ్లికన్, డెమొక్రాటిక్ చట్టసభ సభ్యులలో ఒకరు.

First Published:  23 Sep 2019 2:15 AM GMT
Next Story